Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ రాజ్యాంగ విలువలను కాపాడారు : డిప్యూటీ సీఎం పవన్‌

Dhankhar protected constitutional values as Vice President: Deputy CM Pawan

Dhankhar protected constitutional values as Vice President: Deputy CM Pawan

Pawan Kalyan : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖలో ఆయ‌న ఆరోగ్య సంబంధిత కారణాలను ప్రస్తావించారు. అయితే, రాజకీయ వర్గాల్లో ఈ రాజీనామా వివిధ అర్థాలుగా పరిగణించబడుతోంది. ఉపరాష్ట్రపతిగా 2022 ఆగస్టు 11న బాధ్యతలు స్వీకరించిన ధన్‌ఖడ్, తక్కువ వ్యవధిలోనే పదవి నుంచి వైదొలగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ధన్‌ఖడ్ రాజీనామాపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ అందించిన సేవలను కొనియాడారు. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జీ, మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాంగ విలువలను మీరు నిబద్ధతతో కాపాడారు. నిష్పాక్షికత, సమగ్రత, దయతో మీరు మీ బాధ్యతలు నిర్వహించారు అంటూ పవన్ ట్వీట్‌ చేశారు.

Read Also: Kadapa Central Jail : కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

ఇంకా రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా మీ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తీకరించడం ప్రజా జీవితానికి మార్గదర్శకంగా నిలిచింది. మీరు వీడుతున్న ఈ గౌరవనీయమైన పదవిలో సేవ చేసిన విధానం అందరికీ ప్రేరణలేకిలిస్తుందీ. ఇకమీదట మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగదీప్ ధన్‌ఖడ్ 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు. తర్వాత 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికై, రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. తన పదవీకాలంలో పార్లమెంటరీ చర్చల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, విభిన్న అభిప్రాయాలకు వేదిక కల్పిస్తూ వ్యవహరించారు. ముఖ్యంగా, ఆయన నిర్వహించిన వర్షాకాల సమావేశాల్లో, రాజకీయ పార్టీలు పరస్పర విభేదాలను పక్కనపెట్టి ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.

ధన్‌ఖడ్ పదవీకాలం అత్యంత సున్నితమైన దశలో సాగింది. వివిధ కీలక చట్టాలపై పార్లమెంటులో తీవ్రమైన చర్చలు జరిగిన సందర్భాల్లో, ఆయన నిష్పాక్షికతను పాటించడమే కాకుండా, చట్టనిర్మాణ ప్రక్రియలో సమతుల్యతను నిలబెట్టేందుకు యత్నించారు. ఆయన నిర్ణయం సడెన్‌గా వచ్చినప్పటికీ, ఆరోగ్య సమస్యల కారణంగా తీసుకున్నదని సమాచారం. ఈ రాజీనామా నేపథ్యంతో రాజ్యాంగ వ్యవస్థలోని కీలకమైన పదవికి మళ్లీ కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్పటి వరకు, డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. ధన్‌ఖడ్ రాజీనామా వార్త దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఆయన సేవలపై హృదయపూర్వకంగా స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ధన్‌ఖడ్ పాత్రకు న్యాయం చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: House Arrest : YCP మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్