Delhi PCC : ఢిల్లీ పీసీసీ తాత్కాలిక చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం

Devender Yadav: ఢిల్లీ పీసీసీ తాత్కాలిక చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌(Congress) హైకమండ్‌ ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ(Arvinder Singh Lovely) పార్టీకి షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు అర్విందర్‌ లేఖలో తెలిపారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. […]

Published By: HashtagU Telugu Desk
Devender Yadav appointed as interim chief of Delhi PCC

Devender Yadav appointed as interim chief of Delhi PCC

Devender Yadav: ఢిల్లీ పీసీసీ తాత్కాలిక చీఫ్‌గా దేవేందర్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌(Congress) హైకమండ్‌ ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ(Arvinder Singh Lovely) పార్టీకి షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు అర్విందర్‌ లేఖలో తెలిపారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని చెప్పారు.

Read Also:Russia Vs West : అమెరికా యుద్ధ ట్యాంకులతో రష్యాలో ఎగ్జిబిషన్.. ఎందుకు ?

అయితే మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ.. ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు. కానీ రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని ఆయన పేర్కొన్నారు.

Read Also:Trinadha Rao Nakkina : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంట విషాదం..

ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు ఆప్ మూడు సీట్లు ఇచ్చింది. ఇక ఇతర రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీలో మే 25న లోక్‌సభ పోలింగ్ జరగనుంది.

  Last Updated: 30 Apr 2024, 02:53 PM IST