Site icon HashtagU Telugu

kills 2 women: ఆసుపత్రిలో తల్లీకూతుళ్లను హత్య చేసిన కాంపౌండర్

Murder

Murder

చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రిలో దాచి పెట్టాడు. సిబ్బంది మృతదేహాలను గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒకే ఆస్పత్రిలో తల్లీ కూతుళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. తొలుత ఆపరేషన్ థియేటర్‌లోని వార్డ్‌రోబ్‌లో కూతురి మృతదేహం, ఆ తర్వాత మంచం కింద తల్లి మృతదేహం లభ్యమైంది. ఈ ఆసుపత్రి అహ్మదాబాద్‌లోని కాగ్డాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉంది. ఈ విషయానికి సంబంధించి ఏసీపీ మిలాప్ పటేల్ మాట్లాడుతూ.. తల్లీకూతురు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను ఈ ఆస్పత్రి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వార్డ్‌రోబ్‌లో కూతురి డెడ్ బాడీ మొదట కనిపించింది. ఈ కేసులో తల్లిని విచారించేందుకు పోలీసులు వెతకగా మంచం కింద నుంచి మరో మృతదేహం బయటపడింది. అది ఆమె తల్లిది.

Also Read: 5 Cops Among 17 Arrested: పాక్ నుంచి కాశ్మీర్‌కు డ్రగ్స్.. ఐదుగురు పోలీసులతో సహా 17 మంది అరెస్ట్

దీనికి సంబంధించి ఆస్పత్రిలో పనిచేస్తున్న మన్‌సుఖ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్‌లోని కాగ్డాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉన్న ఆసుపత్రి లోపల నుండి దుర్వాసన వెదజల్లుతున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణలో ఇద్దరు మహిళలు హత్యకు గురైనట్లు తేలింది. కుమార్తె వయస్సు 30 సంవత్సరాలు, ఆమె మృతదేహం ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఉంచిన అల్మారాలో కనుగొనబడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో మృతదేహాలు ఇలా బయటకిరావడంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బందిని కూడా నిత్యం ప్రశ్నిస్తున్నారు.

చెవి నొప్పితో బాధపడుతున్న చంపావాలా, ఆమె కుమార్తె భారతిని బుధవారం ఉదయం 9.30కు వైద్యుడు లేని సమయంలో చికిత్స కోసమని చెప్పి మన్సుఖ్‌ రప్పించాడు. తొలుత భారతికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి గొంతు నులిమి చంపాడు. అనంతరం చంపాను కూడా అదే రీతిలో అంతమొందించాడు. వారు ఆసుపత్రికి వచ్చిన తర్వాత మన్సుఖ్‌ గంట పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా ఆఫ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.