Nitish Kumar : నితీశ్‌కు ఉప ప్రధాని పదవి.. ఇండియా కూటమి బిగ్ ఆఫర్ ?

జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ అంటేనే జంపింగ్ జపాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్. 

Published By: HashtagU Telugu Desk
Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar : జేడీయూ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ అంటేనే జంపింగ్ జపాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్.  ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు కింగ్ మేకర్లుగా ఉన్నారు. వారిద్దరు ప్రస్తుతానికి ఎన్డీయే కూటమిలో ఉన్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇండియా కూటమికి చెందిన దిగ్గజ నేత శరద్ పవార్ రాయబారం నడుపుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లతో మాట్లాడిన శరద్ పవార్.. ఇండియా కూటమికి మద్దతు ఇస్తే చాలా కీలకమైన అవకాశాలను కేంద్ర సర్కారు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నితీశ్ కుమార్‌కు డిప్యూటీ ప్రధానమంత్రి పోస్టును ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే శరద్ పవార్ ప్రపోజల్స్‌కు నితీశ్(Nitish Kumar), చంద్రబాబు ఎలా స్పందించారు అనేది తెలియరాలేదు.

We’re now on WhatsApp. Click to Join

చంద్రబాబు ఎన్డీయే కూటమిలో నమ్మకమైన మిత్రపక్షంగా  కొనసాగేందుకే ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నితీశ్ కుమార్ మాత్రం అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే జాతీయ రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో తాను ఎన్డీయే కూటమిలోనే కొనసాగుతానంటూ నితీశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రకటనలను నమ్మడానికి వీలుండదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి జంప్ అయ్యేటప్పుడు కూడా ఇలాంటి నీతి వాక్యాలనే నితీశ్ కుమార్ వల్లించారు.  ఒకవేళ నితీశ్ మూడ్ మార్చుకుంటే ఎన్డీయే కూటమికి అది పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే ఎన్​డీఏ కూటమిలో బీజేపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీ నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ. మొత్తం మీద బిహార్ పాలిటిక్స్, ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. చంద్రబాబు, నితీశ్ నిర్ణయాలను ఇప్పుడు అందరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి.. ఎన్డీయే కూటమితోనే ఉండాలని చంద్రబాబు, నితీశ్‌లను కోరినట్లు తెలుస్తోంది.

Also Read :AP & TG Election Results Live Updates : గన్నవరం నుంచి కుటుంబంతో హైదరాబాద్ బయలుదేరిన వంశీ

  Last Updated: 04 Jun 2024, 06:10 PM IST