Deputy CM – 94 Votes : 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం.. ఎక్కడంటే ?

Deputy CM - 94 Votes : ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి !! అయితేనేం రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అవి ఎవరినీ వదలవు!!

  • Written By:
  • Updated On - December 4, 2023 / 11:34 AM IST

Deputy CM – 94 Votes : ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి !! అయితేనేం రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అవి ఎవరినీ వదలవు!!  ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం టీఎస్​ సింగ్ దేవ్ ​కేవలం 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఎస్​ సింగ్ దేవ్​ అంబికాపూర్ అసెంబ్లీ ​ స్థానం నుంచి పోటీ చేశారు. ఇక్కడ సింగ్​ దేవ్​కు మొత్తం 90,686 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రాజేశ్ అగర్వాల్​కు 90,780 ఓట్లు వచ్చాయి. దీంతో 94 ఓట్ల లీడ్‌తో విజయం బీజేపీ అభ్యర్థిని వరించింది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్​ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశారామ్​ నేతమ్​ 16 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ ఆశారామ్​కు 67,980 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి శంకర్​ ధ్రువకు 67,964 ఓట్లు పడ్డాయి.
  • పత్యాలంగావ్ స్థానంలో​ బీజేపీ అభ్యర్థి గోమతి సాయి 255 ఓట్లతో గెలిచారు. ఇక్కడ ఆమెకు  82,320 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్​ అభ్యర్థికి 82,065 ఓట్లు వచ్చాయి.
  • పాలీ తానాఖార్​ స్థానంలో గోండ్వానా రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు తులేశ్వర్​ సింగ్​ మర్కామ్ 714 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ ఈయనకు 60,862 ఓట్లు రాగా, కాంగ్రెస్​ అభ్యర్థి దులేశ్వరి సిదర్​కు 60,148 ఓట్ల పడ్డాయి.
  • బింద్రాన్వాగఢ్ స్థానంలో​ కాంగ్రెస్​ అభ్యర్థి జనక్​ ధ్రువ్ 816 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గోవర్థన్ సింగ్​ మాంఝీపై గెలిచారు. ఇక్కడ ధ్రువ్​కు 92,639 ఓట్లు రాగా, ప్రత్యర్థి గోవర్థన్ సింగ్‌కు 91,823 ఓట్లు వచ్చాయి.
  • భిలాయ్ నగర్ స్థానంలో​ కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్​ 1,264 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రేమ్​ ప్రకాశ్​ పాండేకు 53,141 ఓట్లు రాగా, దేవేంద్రకు 54,405 ఓట్లు వచ్చాయి.
  • 13 మందితో కూడిన ఛత్తీస్‌గఢ్ మంత్రివర్గంలో 9 మంది ఈ ఎన్నికల్లో ఓడిపోవడం(Deputy CM – 94 Votes) గమనార్హం.