Site icon HashtagU Telugu

Dense Fog : ఢిల్లీని దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం..!

Dense fog in Delhi.. Interruption of flights..!

Dense fog in Delhi.. Interruption of flights..!

Dense Fog : బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఓ వైపు ఆకాశం మేఘావృతమై ఉండగా.. మరో వైపు చలితో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రాత్రి నగరంలో పలుచోట్ల జల్లులు కురవడంతో నగరం ఒక్కసారిగా చలి కొనసాగుతున్నది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు, కనిష్ఠంగా 9 డిగ్రీల వరకు ఉండొచ్చని చెప్పింది. ఈ సీజన్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మంగళవారం రాత్రి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.

నగరవ్యాప్తంగా భారీగా పొగమంచు నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు తెలిపింది. విమానాలు ఆలస్యం కావడంతో పాటు రద్దయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. పొగమంచు కారణంగా రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. అప్‌డేట్స్‌ కోసం విమానాయాన సంస్థలను సంప్రదించాల్సిందిగా ప్రయాణికులకు సూచించింది. విమాన షెడ్యూల్‌ల కోసం విమానయాన సంస్థలతో తనిఖీ చేయాలని ప్రయాణికులను కోరారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు.. విమాన స్టేటస్‌ని చూసుకోవాలని కోరింది.

మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే కనీసం 20 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రభావిత రైళ్లలో గోవా ఎక్స్‌ప్రెస్, పూర్వా ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్ మరియు రేవా-ఆనంద్ విహార్ టెర్మినల్ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. కాగా, సెంట్రల్‌, సౌత్‌, ఈస్ట్‌ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వానపడింది. గరిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సీజన్‌లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత కావడం విశేషం. ఇక ఢిల్లీలో వాయు కాలష్యం స్వల్పంగా తగ్గింది. బుధవారం 6 గంటలకు ఏక్యూఐ 363గా నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (GRAP) స్టేజ్‌-4 అమలవుతున్నది.

Read Also: AUS vs IND: రేప‌ట్నుంచి నాలుగో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్