Sundar Pichai : గూగుల్ సీఈవో పదవికి సుందర్‌ పిచాయ్‌ రాజీనామా చేస్తారా ?

Sundar Pichai : సుందర్ పిచాయ్.. భారతదేశ ముద్దుబిడ్డ. గూగుల్ సీఈవో‌గా ఉన్న సుందర్ పిచాయ్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 12:08 PM IST

Sundar Pichai : సుందర్ పిచాయ్.. భారతదేశ ముద్దుబిడ్డ. గూగుల్ సీఈవో‌గా ఉన్న సుందర్ పిచాయ్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గూగుల్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన సుందర్ పిచాయ్‌(Sundar Pichai) ఇంతకీ ఎందుకు రిజైన్ చేస్తున్నారు ? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది. ఆ వివరాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

AI Gemini ఇమేజ్ జనరటేర్‌ను ఈ మధ్యే గూగుల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై సుందర్ పిచాయ్ అంచనాలు తలకిందులయ్యాయి. దీనివల్ల కంపెనీ క్రెడిబిలిటీ కూడా దెబ్బతింది. అందుకే ఇప్పుడు సుందర్ పిచాయ్‌ రాజీనామాకు డిమాండ్ వెల్లువెత్తుతోందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. పిచాయ్‌ స్థానంలో మరొకరికి ఆ పదవిని అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి Gemini Image Generatorను గూగుల్ ఆపేసింది. AI టెక్నాలజీపైనా పెట్టుబడులు పెట్టడాన్ని తగ్గించింది. Gemini Image Generatorలో ఇమేజ్‌లు సరైన విధంగా జనరేట్ కావడం లేదు. ఈ సర్వీసును నిలిపివేసినప్పటి నుంచి కంపెనీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తాయని సమాచారం. ఈ వార్తలు బయటికి రావడంతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో గూగుల్ (ఆల్ఫాబెట్)  షేర్ వాల్యూ కూడా పడిపోయింది.

Also Read :Five Government Jobs : హ్యాట్సాఫ్ మమత.. ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్

ఇటీవల కాలంలో నష్టాలను భర్తీ చేసుకునేందుకు గూగుల్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకునే యత్నంలో భాగంగానే కొంత మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. దీనిపై పలు  సందర్భాల్లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ‘‘తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరణ ఇచ్చారు.గూగుల్‌లోని డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో వంద మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం.  వాయిస్ బేస్డ్‌ Google Assistant తో పాటు AR హార్డ్‌వేర్‌లోని ఉద్యోగులను కూడా తొలగిస్తారని అంటున్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులపైనా వేటు వేస్తారని చెబుతున్నారు.

Also Read :Old City Lac Bangles : హైదరాబాద్ పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు