Delivery Boy: నోయిడాలో దారుణం, ఒంటరిగా ఉన్న యువతిపై డెలివరీ బాయ్ రేప్!

ఓ డెలివరీ బాయ్ యువతిని రేప్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Gang Rape

Gang Rape

Delivery Boy: ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో చాలామంది యువత డెలివరీ బాయ్స్ గా మారుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు. అయితే ఒకరు, ఇద్దరి కారణంగా మంచిగా విధులు నిర్వహించే బాయ్స్ పై చెడు ప్రభావం పడుతోంది. తాజాగా గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆర్డర్‌ను తీసుకోవడానికి డోర్ తెరిచిన సమయంలో 19 ఏళ్ల యువతిపై డెలివరీ బాయ్ రేప్ చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ ఉదయం మొబైల్ యాప్‌లో పాలు, గుడ్లు ఆర్డర్ చేసి డెలివరీ చేసే వ్యక్తి వచ్చేసరికి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన గ్రేటర్ నోయిడా గ్రామానికి చెందిన డెలివరీ బాయ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పరారీలో ఉన్నాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతడ్ని కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ఖైర్‌పూర్‌లో నిందితుడిని అరెస్టు చేసి సెక్టార్ 3కి చేరుకోగానే ప్రభుత్వ పిస్టల్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో మరిన్ని బలగాలు రంగంలోకి దిగి తక్షణమే కూంబింగ్ జరిపారు, ”అని సెంట్రల్ నోయిడా ADCP హిర్దేష్ కతేరియా తెలిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడి కాలుకు గాయమైంది’ అని కతేరియా తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడి నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కతేరియా తెలిపారు. “నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు. డెలివరీపై గతంలో అనేక కేసులున్నాయి.

  Last Updated: 30 Oct 2023, 01:20 PM IST