Site icon HashtagU Telugu

Serial Killer: 30 మంది బాలికలపై హత్యాచారం.. సీరియల్ కిల్లర్‌ కు ఏమైందంటే..

Serial Killer, Who Raped And Murdered Over 30 Children, Sentenced To Life

Delhi's Serial Killer, Who Raped And Murdered Over 30 Children, Sentenced To Life

Serial Killer : 30 మంది మైనర్ బాలికలను అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ఢిల్లీ సీరియల్ కిల్లర్‌ (Serial Killer) రవీంద్ర కుమార్ (32) కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. 2015 జూలై 19న దక్షిణ ఢిల్లీలో ఆరేళ్ళ చిన్నారిపై హత్యాయత్నం చేయబోయి అతడు పోలీసులకు దొరికిపోయాడు. నాటి నుంచి జైలులోనే ఉన్నాడు. అప్పట్లో పోలీస్ ఇంటరాగేషన్ లో సైకో రవీంద్ర కుమార్ చెప్పిన విషయాలు విని అందరూ హడలిపోయారు.

2008 నుంచి 2015 మధ్యకాలంలో దాదాపు 30మంది పిల్లలను రేప్ చేసి మర్డర్ చేశానని అతడు అంగీకరించాడు. ఢిల్లీ పరిధిలో 15 మంది మైనర్ బాలికలకు చంపిన లొకేషన్లను కూడా అతడు పోలీసులకు చూపించాడు. డ్రగ్స్ మత్తు, పోర్న్ వీడియోలు చూసే అలవాటు వల్ల సైకోగా మారి.. ఈ సీరియల్ మర్డర్స్ చేశానని చెప్పాడు. 2008లో ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన రవీంద్ర ఢిల్లీలో కూలీగా పనిచేసేవాడని .. తొలుత తనతో పాటు కూలీ పనిచేసే వాళ్ళ పిల్లలనే టార్గెట్ గా ఎంచుకునేవాడని పోలీసులు తెలిపారు.

రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య తోటి కూలీలు అలసిపోయి నిద్రలో ఉండగా .. వారి ఆడ పిల్లలకు 10 రూపాయల నోటు లేదా చాకోలెట్ ను చూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్యాచారం చేసేవాడని వివరించారు. ఒక్కోసారి మైనర్ బాలికల కోసం వెతుకుతూ రోడ్డు వెంట 40 కి.మీ నడిచిన రోజులు కూడా ఉన్నాయని దర్యాప్తులో సీరియల్ కిల్లర్‌ రవీంద్ర పోలీసులకు చెప్పాడు.

పోలీసులకు దొరికిపోతాననే భయంతోనే రేప్ చేశాక బాలికలను మర్డర్ చేసేవాడినని తెలిపాడు. అతడు పంతొమ్మిదేళ్ల వయసులో (2008లో) తొలిసారిగా ఢిల్లీలోని కరాలా ప్రాంతానికి చెందిన ఓ బాలికపై హత్యాచారం చేశాడు.

Also Read:  Mahanadu 2023 : మ‌హానాడుకు ముస్తాబ‌వుతోన్న రాజ‌మండ్రి! లోకేష్ కు ప‌దోన్న‌తి?