Delhi : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌ ఎన్ బ్లాక్‌లో బ్యాగు కలకలం

Delhi: ఢిల్లీలోని ఐకానిక్ కన్నాట్ ప్లేస్‌లోని ఎన్ బ్లాక్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు  కనుగొనబడింది. కన్నాట్‌ప్లేస్‌ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలంలో ఢిల్లీ పోలీసు బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు, బాంబు నిర్వీర్య దళం ఉన్నారు. ఈ ఘటనతో […]

Published By: HashtagU Telugu Desk
Delhi Suspicious unattended bag found at Connaught Place, bomb squad called in

Delhi Suspicious unattended bag found at Connaught Place, bomb squad called in

Delhi: ఢిల్లీలోని ఐకానిక్ కన్నాట్ ప్లేస్‌లోని ఎన్ బ్లాక్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు  కనుగొనబడింది. కన్నాట్‌ప్లేస్‌ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలంలో ఢిల్లీ పోలీసు బృందం, అగ్నిమాపక శాఖ అధికారులు, బాంబు నిర్వీర్య దళం ఉన్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. ఘటనా స్థలంలో పోలీసులు విచారణ కొనసాగించారు. బ్యాగు ఉన్న ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Equity Shares: కంపెనీ షేర్ల‌ను ఉద్యోగుల‌కు బ‌హుమ‌తిగా ఇచ్చిన ప్ర‌ముఖ‌ కంపెనీ

కాగా, కన్నాట్ ప్లేస్ ఢిల్లీలోని ఒక సందడిగా ఉన్న మార్కెట్, దాని ప్రసిద్ధ బ్రాండ్లు మరియు తినుబండారాలకు ప్రసిద్ధి. ప్రజలు గుమికూడేందుకు మరియు సమావేశానికి ఇది ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఇది నగరంలో ఎక్కువగా సందర్శించే మరియు ఉల్లాసమైన ప్రాంతాలలో ఒకటి.

 

 

  Last Updated: 04 May 2024, 04:44 PM IST