Delhi Super Power : మహారాష్ట్ర సీఎం పదవి విషయంలో శివసేన (ఉద్ధవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం పదవి దక్కకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుయుక్తులు పన్నుతున్నారని ఆయన కామెంట్ చేశారు. షిండేకు ఢిల్లీలోని ఒక సూపర్ పవర్ అండగా నిలుస్తోందని రౌత్ పేర్కొన్నారు. ‘‘ఆ సూపర్ పవర్ అండను చూసుకొని షిండే రెచ్చిపోతున్నారు. లేదంటే ఫడ్నవిస్‌కు వ్యతిరేకంగా ఈ స్థాయిలో షిండే పావులు కదిపి ఉండేవారే కాదు’’ అని ఆయన తెలిపారు.
Also Read :Human Washing Machine : మనిషిని ఉతికి ఆరేసే ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’
ఫడ్నవిస్‌కు వ్యతిరేకంగా మహాయుతి కూటమిలో కుట్రలకు ఏక్‌నాథ్ షిండే కేంద్ర బిందువుగా నిలుస్తున్నారని రౌత్ చెప్పారు. డిప్యూటీ సీఎం పదవికి బదులుగా రాష్ట్ర హోంశాఖను తనకు కేటాయించాలని షిండే(Delhi Super Power) కోరడం వెనుక కూడా ఢిల్లీ సూపర్ పవర్ ఉందన్నారు. హోంశాఖను వదిలేసి, డిప్యూటీ సీఎం పదవిని తీసుకోవాలని షిండేకు ఎన్డీయే మిత్రపక్ష నేత రామ్‌దాస్ అథవాలే నచ్చజెప్పుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను పరిశీలకులుగా బీజేపీ అధిష్ఠానం పంపింది.