Site icon HashtagU Telugu

Delhi Schools Closed: సెప్టెంబర్ 8 నుంచి 10 తేదీల్లో జీ20 సదస్సు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు..!

Delhi Schools Closed

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Delhi Schools Closed: ఢిల్లీలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. సెప్టెంబర్ 8 నుండి 10, 2023 వరకు దేశ రాజధానిలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు (Delhi Schools Closed) ఉంటుంది. వచ్చే నెల ఈ వ్యవధిలో ఢిల్లీలో G20 సదస్సు జరగాల్సి ఉన్నందున ఈ మూడు రోజుల సెలవులు ఆమోదించబడ్డాయి. ఈ సమ్మిట్‌లో ప్రపంచం నలుమూలల నుండి అనుభవజ్ఞులైన నాయకులతో సహా ఇతర ప్రముఖులు ఢిల్లీలో సమావేశమవుతారు.

ఇటువంటి పరిస్థితిలో ఈ నాయకులు, ప్రతినిధులందరికీ భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. ట్రాఫిక్ రూట్ కూడా మార్చారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. మీడియా కథనాల ప్రకారం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనుమతి కూడా ఇచ్చారు. ఢిల్లీలోని పాఠశాలలు, కళాశాలలే కాకుండా బ్యాంకులు, మార్కెట్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Onion Prices: ఉల్లి ధరల పెరుగుదల.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

జి 20 సదస్సు ప్రగతి మైదాన్‌లో జరగనుంది

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో జీ20 సదస్సు జరగనుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది.