6 States – 50 Teams : పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన వ్యవహారం.. 6 రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్

6 States - 50 Teams : డిసెంబర్ 13న లోక్‌సభలో ఇద్దరు దుండగులు రంగు పొగ గొట్టాలతో హల్‌చల్ చేసిన ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 11:58 AM IST

6 States – 50 Teams : డిసెంబరు 13న లోక్‌సభలో ఇద్దరు దుండగులు రంగు పొగ గొట్టాలతో హల్‌చల్ చేసిన ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన టీమ్స్ దర్యాప్తు కోసం రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు వెళ్లాయి. మరో 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల డిజిటల్ సమాచారం, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత నేపథ్యంపై దర్యాప్తు చేయిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందాలు కొందరు నిందితులను తమతో పాటు ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లినట్లు తెలిసింది.

We’re now on WhatsApp. Click to Join.

నిందితుల్లో ఒకరైన సాగర్ శర్మను ఢిల్లీ సదరన్ రేంజ్  పోలీస్ ప్రత్యేక సెల్ విచారిస్తోంది. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝాను ఢిల్లీ జనక్‌పురిలోని సౌత్ వెస్ట్రన్ రేంజ్ పోలీసుల ప్రత్యేక సెల్ టీమ్‌‌కు అప్పగించారు. ఇటీవల ఈ టీమే రాజస్థాన్‌లోని నాగౌర్‌కు వెళ్లి.. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటన నిందితుల కాలిపోయిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి.. లలిత్ ఝా ఆ ఫోన్లను తీసుకెళ్లి తగలబెట్టాడని గుర్తించారు.  మరో నిందితుడు మనోరంజన్‌ను న్యూ ఢిల్లీ రేంజ్ (ఎన్‌డీఆర్) లోధి రోడ్‌లో ఉన్న స్పెషల్ సెల్‌కు అప్పగించారు. నిందితురాలు నీలం దేవి యొక్క విచారణ బాధ్యతను ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ప్రత్యేక సెల్ బృందం నిర్వహిస్తోంది. ఈవిధంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగాలు వారందరినీ దర్యాప్తు చేసిన తర్వాత..తదుపరి విచారణ కోసం ఎన్ఎఫ్సీ స్పెషల్ సెల్(6 States – 50 Teams) బృందానికి అప్పగిస్తారు.

Also Read: Instagram Feature : కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌‌‌‌కు కొత్త లుక్