Site icon HashtagU Telugu

Holi : హోలీ వేడుక‌ల‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు.. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే..?

Holi Celebrations

Holi Celebrations

ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగను ప్ర‌జ‌లు జరుపుకోనున్నారు. రోడ్లపై పాదచారులకు, వాహనదారులకు భద్రత కల్పించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ విభాగం విస్తృతమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, రెడ్ లైట్ జంపింగ్, మైనర్లు డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం/రైడింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై విన్యాసాలు చేయడం వంటి ఘటనలను తగ్గించడమే లక్ష్యంగా పోలీసులు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు 287 ప్రధాన కూడళ్లలో, 233 వల్నరబుల్ పాయింట్ల వద్ద 2,033 మంది అధికారులతో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించనున్నారు. ఈ తనిఖీ బృందాలు పిసిఆర్, స్థానిక పోలీసు బృందాలతో పాటు దేశ రాజధాని అంతటా వివిధ రోడ్లు మరియు వ్యూహాత్మక ప్రదేశాలలో త‌నిఖీలు ఉంటాయి. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల ప్రకార ఉల్లంఘన కేసుల్లో, డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంటారు. కనీసం మూడు నెలల పాటు లెసెన్స్ సస్పెన్షన్ చేస్తారు. మైనర్‌లు వాహనాలు నడుపుతున్నట్లు, స్టంట్‌లు చేయడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించిన వాహనాల నమోదిత యజమానులపై కూడా చర్యలు ఉంటాయ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు ప్రజలను కోరారు.

Exit mobile version