AAP: ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

  • Written By:
  • Updated On - March 26, 2024 / 11:39 AM IST

 

AAP: ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ (AAP) అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రధాని మోడీ(PM Modi) ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుగ్లక్‌ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోడీ నివాసానికి బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజధాని అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కాగా, ఆప్‌ ఆదోళనలకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు.. పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌ ప్రాంతాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఆప్‌ ఆదోళనల నేపథ్యంలో ఢిల్లీ వాహనదారులకు పోలసులు పలు సూచనలు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. తుగ్లక్‌ రోడ్డులో, సఫ్దర్‌గంజ్‌ రోడ్డు, కేమల్‌ అటటుర్‌ మార్గ్‌లో వాహనాలను నిలపడం గానీ, పార్కింగ్‌ చేయడానికి గానీ అనుమతి లేదని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్​ నేతలు చేపట్టిన ప్రధాని మోడీ నివాసం ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పంజాబ్​ మంత్రితో సహా పలువురు ఆప్​ నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రధాని మోడీ నివాసం చుట్టూ పలు అంచెల్లో పోలీసులు మోహరించారు. అటు వైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్‌ విధించారు. ఆప్ కార్యకర్తలు వచ్చే అవకాశమున్న ఢిల్లీలోని పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అలాగే మూడు మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. నిరసనల కారణంగా సెంట్రల్ ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు.

Read Also:  Attack On Pak : పాక్ నౌకాదళ స్థావరంపై ఎటాక్.. 12 మంది సైనికులు మృతి