Delhi : ఢిల్లీ తదుపరి సీఎం సునీతా కేజ్రీవాల్?..ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 10:38 AM IST

Sunitha Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​(Delhi CM Arvind Kejriwal)ను మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case) లో జ్యుడిషియల్ కస్టడీ(Judicial Custody) విధించి తీహార్‌​ జైలు(Tihar Jail)కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈడీ కస్టడీలో లాగా జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. దిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరూ అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతాSunitha Kejriwal) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం మొట్టమొదట వినిపిస్తున్న పేరు సునీతా కేజ్రీవాల్. అయితే ఇప్పటి వరకు రాజకీయాలను దూరంగానే ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్​తో సునీతా తెరపైకి వచ్చింది. భర్త తరఫున మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేయటం వంటివి చేశారు. దీంతో తదుపరి దిల్లీ సీఎంగా బాధ్యతలు చేపడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్​కు జైలు శిక్ష విధించడం వల్ల ఆయన భార్యను సీఎం పగ్గాలు చేపట్టినట్లు సునీతా కేజ్రీవాల్​ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు.

Read Also: Mrunal Thakur : రౌడీ బాయ్ విజయ్ తో పనిచేయడం ప్రతి హీరోయిన్ కల – మృణాల్

మరో వైపు సునీతా కేజ్రీవాల్​కు సీఎం బాధ్యతలు చేపట్టే అర్హతలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఐఆర్​ఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తి పదవీ విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివారు, ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఎన్నికల ప్రచారల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్​ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ కూడా జైలులో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

Read Also: Mayank Yadav: ఎవరీ మయాంక్ యాదవ్.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు..!

ఇదిలా ఉండగా 55 మంది ఆప్​ ఎమ్మెల్యేలు మంగళవారం సునీతా కేజ్రీవాల్​ కలిశారు. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నా సరే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడపాలని తెలిపారు. దిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రికి అండగా ఉన్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్​కు తెలిపయజేయాలని ఎమ్మెల్యేలు సునీతాను కోరారు. మరోవైపు సునీతా కేజ్రీవాల్​కు దిల్లీ సీఎం పదవిని ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని ఆప్​ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అయితే మేము అలా చేయమని, కేజ్రీవాల్ జైలు నుంచే పాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. దీంతో సునీతా ఒకవేళ సీఎం పదవి బాధ్యతలు చేపడితే ఆప్​ నేతల మద్దతు ఎంతవరకూ ఉంటుందనే అనుమానాలు కూడా వస్తున్నాయి.