Delhi NCR: ఢిల్లీ-NCRలో ఈరోజు మళ్ళీ పొగమంచు, కాలుష్య పొగ రెండూ కలిసి విరుచుకుపడ్డాయి. ఢిల్లీ, నోయిడా నగరాలు దట్టమైన పొగమంచు దుప్పటిని కప్పుకున్నాయి. దీనివల్ల చలి తీవ్రత పెరగడమే కాకుండా దృశ్యమానత 20 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. మరోవైపు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 437గా నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య స్థాయిని సూచిస్తుంది. ప్రధాన నగరాల సగటు AQI వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ సగటు: 347
నోయిడా: 482
గ్రేటర్ నోయిడా: 217
పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ ప్రభుత్వం ‘నో పియుసి – నో ఫ్యూయల్’ నిబంధనతో పాటు, కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రాప్-4 నిబంధనలను అమలు చేస్తోంది.
Also Read: లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం
ఎయిర్ ఇండియా కీలక సూచనలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం అడ్వైజరీ జారీ చేసింది.
ఫ్లైట్ స్టేటస్: రాబోయే కొద్దిరోజులు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు వెబ్‌సైట్‌లో తమ ఫ్లైట్ స్టేటస్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
సహాయక సిబ్బంది: పొగమంచు కారణంగా విమానాలు రద్దీ అయినా లేదా ఆలస్యమైనా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు గ్రౌండ్ స్టాఫ్ 24 గంటలు అందుబాటులో ఉంటారు.
‘ఫాగ్ కేర్’: పొగమంచు వల్ల ప్రభావితమయ్యే విమానాల సమాచారాన్ని ప్రయాణికుల ఫోన్ నంబర్లకు ముందే పంపిస్తారు.
ఉచిత మార్పులు/రీఫండ్: ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులు తమ విమాన సమయాన్ని మార్చుకోవచ్చు లేదా పెనాల్టీ లేకుండా పూర్తి రీఫండ్ పొందవచ్చు.
ప్రయాణికులు ఓపికతో సహకరించాలని, భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో AQI వివరాలు
రాజధానిలోని అనేక ప్రాంతాలు 300 నుండి 450 మధ్య AQIతో ‘రెడ్ జోన్’లో ఉన్నాయి.
- చాందీ చౌక్- 443
- రాజౌరీ గార్డెన్- 421
- ITO చౌక్- 398
- హిండన్ ఎయిర్‌పోర్ట్ / పహార్‌గంజ్- 384
- IGI ఎయిర్‌పోర్ట్- 382
- అశోక్ నగర్- 349
- లాజ్‌పత్ నగర్- 337
