Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం – మంత్రి రామ్మోహన్

మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 12:09 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో వరసగా రెండో రోజు వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఢిల్లీలోని విమానాశ్రయం టెర్మినల్-లో పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు, విమానాయన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు రద్దు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో టెర్మినల్‌ 1 (Terminal-1)ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి (Union Minister of Civil Aviation ) రామ్మోహన్‌ నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) సందర్శించారు. ఘటనలో బాధితులకు వైద్యం సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం రామ్ మోహన్ మీడియాతో మాట్లాడారు. ‘భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్ట్‌ వెలుపల ఉన్న కొంత భాగం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌, ఫైర్‌ సేఫ్టీ టీమ్‌లు ఘటనాస్థలం వద్ద అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టెర్మినల్‌ను మూసివేశాం. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. కూలిపోయిన భవనం పాతది. 2009లో ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నాం. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం’ అని, ఈ ఘటన లో మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Read Also : CM Chandrababu : ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు చేరువయ్యారా..?