Site icon HashtagU Telugu

Gang Rape: గదిలో బంధించి విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం

Gang Raped

Gang Raped

దేశ రాజధాని ఢిల్లీలో మయన్మార్ కు చెందిన ఓ రిజిస్టర్డ్ శరణార్థి మహిళపై సామూహిక అత్యాచారం (Gang Rape) జరిగింది. ఫిబ్రవరి 22న ఓ ఆటో డ్రైవర్ కాళింది కుంజి మెట్రో స్టేషన్ నుండి శరణార్థి మహిళను, ఆమె కూతురుని అపహరించి తన గదికి తీసుకెళ్లాడు. అనంతరం మరో ముగ్గురితో కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఓ మారుమూల ప్రాంతంలో వదిలేశారు. బాధితురాలు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

మయన్మార్ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మహిళ చేసిన ఆరోపణల ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు నిందితుల్లో ఎవరినీ పోలీసులు పట్టుకోలేకపోయారు. ఓ ఆటోడ్రైవర్ తన ఏడాదిన్నర చిన్నారిని కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. అనంతరం ఆమెను గుర్తు తెలియని గదిలోకి తీసుకెళ్లి అక్కడ నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు.

Also Read: Life Threat: అంబానీ, అమితాబ్ కు ప్రాణహాని.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ వయస్సు 21 ఏళ్లు. ఆమె తన భర్త, బిడ్డతో కలిసి వికాస్పురి ప్రాంతంలో అద్దెకు నివసిస్తుంది. దాదాపు 2 నెలలుగా ఆమె ఇక్కడే నివసిస్తోంది. ఫిబ్రవరి 22న ఆమె కంచన్ కుంజ్, కాళింది కుంజ్‌కి వెళ్లింది. బాధితురాలు రిజిస్టర్డ్ శరణార్థి. ఆమె రోహింగ్యా మూలానికి చెందినది. ఆ మహిళ తన బిడ్డతో కలిసి మెట్రో స్టేషన్‌లోని గేట్ నంబర్ 1 దగ్గర నిలబడి ఉంది. అకస్మాత్తుగా ఓ ఆటో డ్రైవర్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె ముఖంపై గుడ్డను పెట్టి చిన్నారితో పాటు ఆమెను కిడ్నాప్ చేశాడు.

కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చేసరికి ఓ గదిలో తాళం వేసి కనిపించింది. ఆ గదిలో నలుగురు యువకులు ఉన్నారు. అక్కడ వ్యక్తులు ఆమెను కొట్టి, ఒకరి తర్వాత ఒకరు బలవంతంగా ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారు. మరుసటి రోజు ఫిబ్రవరి 23 రాత్రి వారు మహిళను కారులో కూర్చోబెట్టి, తెలియని ప్రదేశంలో ఆమెను విడిచిపెట్టారు. అనంతరం బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 26న కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 365, 368, 376డి, 323, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని తీయగా అందులో ఆరోపించిన ఆటో తదితరాలు కనిపించలేదు. ఇది కాకుండా, మహిళ నివసించే ప్రదేశం నుండి సిసిటివి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది.