Resignation in Delhi: సిసోడియా, సత్యేంద్ర జైన్‌ రాజీనామా

ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు టాప్ మినిస్టర్స్‌ మనీష్ సిసోడియా (), సత్యేంద్ర జైన్‌ తమ పదవులకు రాజీనామా (Resignation) చేశారు. ఈ రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ వెంటనే ఆమోదించారు. మనీలాండరింగ్ కేసులో చానాళ్లుగా జైల్లో ఉన్నారు సత్యేంద్ర జైన్‌. తీహార్ జైల్లో ఆయన రాజభోగాలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో దుమారం రేపాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆదివారం అరెస్ట్ అయ్యారు సిసోడియా. అనూహ్యంగా ఈ ఇద్దరూ రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. అయితే జైన్ రాజీనామా (Resignation) కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఇప్పుడు సిసోడియా కూడా జైలుకెళ్లడంతో.. విపక్షానికి అవకాశం ఇవ్వకుండా కేజ్రీవాల్‌ ముందస్తుగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఢిల్లీ ప్రభుత్వంలో మొత్తం 12 మంత్రిత్వశాఖలు పర్యవేక్షిస్తున్నారు సిసోడియా. దీంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సిసోడియాకు సూచించింది. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సిసోడియా. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఢిల్లీకి సంబంధించిన కేసు అయినంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సరికాదని పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది సీబీఐ. నిన్న కోర్టులో హాజరుపరచి.. ఐదు రోజులు కస్టడీకి అనుమతి తీసుకుంది.

Also Read:  Wankhede Stadium: వాంఖేడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం