Delhi Mayor Election: ముచ్చటగా మూడోసారి.. ఈనెల 6న ఢిల్లీ మేయర్ ఎన్నిక

ఎట్టకేలకు మరోసారి ఢిల్లీలో మేయర్ ఎన్నికకు (Delhi Mayor Election) తేదీ ఖరారైంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫిబ్రవరి 6న (సోమవారం) ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) హౌస్ సెషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు రాజ్ నివాస్ అధికారులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - February 2, 2023 / 06:55 AM IST

ఎట్టకేలకు మరోసారి ఢిల్లీలో మేయర్ ఎన్నికకు (Delhi Mayor Election) తేదీ ఖరారైంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫిబ్రవరి 6న (సోమవారం) ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) హౌస్ సెషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు రాజ్ నివాస్ అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తేదీని ప్రతిపాదించిందని బుధవారం (ఫిబ్రవరి 1) ఓ అధికారి తెలిపారు. మరోవైపు ఎంసీడీ ఎన్నికల్లో గెలిచిన ఆప్‌, పీఠం నుంచి వైదొలగిన బీజేపీ మధ్య పోరు కొనసాగుతోంది. దీని వల్ల మేయర్‌ ఎన్నిక రెండుసార్లు నిలిచిపోయింది. MCD వాయిదా వేసిన మొదటి సమావేశాన్ని ఫిబ్రవరి 6న నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను LG ఆమోదించింది. మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ ఎన్నికను కోరింది.

మేయర్ ఎన్నిక కోసం ఫిబ్రవరి 10న (శుక్రవారం) సభను నిర్వహించాలని ఎంసీడీ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం ఫిబ్రవరి 3, 4, 6 తేదీలను సూచించింది. ఆప్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదాల మధ్య సెషన్ వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 6, జనవరి 24న సభ సమావేశమైనప్పుడు మేయర్ ఎన్నిక నిర్వహించబడలేదు. మేయర్ ఎన్నికను నిర్ణీత గడువులోగా నిర్వహించాలని కోరుతూ ఆప్‌ మేయర్‌ అభ్యర్థి శైలి ఒబెరాయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారని పార్టీ అధికారులు తెలిపారు.

Also Read: Green Growth: గ్రీన్ గ్రోత్ దిశగా భారత్ అడుగులు.. బడ్జెట్‎లో భారీ కేటాయింపులు!

ఢిల్లీలో మేయర్ ఎన్నికలకు తదుపరి తేదీ ఫిబ్రవరి 6న ప్రకటించడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడారు. ఇందులో బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎంసీడీ పాలనలో బీజేపీపై ఢిల్లీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ హామీని నమ్మి ఢిల్లీ ప్రజలు MCDలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి AAPకి ఓటు వేశారు. 15 ఏళ్ల పాలన తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీని ఓడించారని, ఇప్పుడు మేయర్ ఎన్నికను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఫిబ్రవరి 6న మేయర్ ఎన్నిక నిర్వహించి ఆమ్ ఆద్మీ పార్టీకే మేయర్ పదవిని దక్కేలా చేస్తుందని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ పని చేస్తే అన్ని పనులు వెంటనే పూర్తవుతాయని ఆయన అన్నారు.