Monkeypox: భారత్ లో నాలుగు మంకీపాక్స్ కేసులు…ఢిల్లీ వ్యక్తికి పాజిటివ్..!!

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నాలుగో కేసు ఢిల్లీకి చెందిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 12:50 PM IST

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నాలుగో కేసు ఢిల్లీకి చెందిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీలో ఇది తొలి కేసు. అతడికి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేనట్లుగా సమాచారం. దీంతో కలుపుకుని మంకీపాక్స్ కేసుల సంఖ్య 4కు చేరుకుంది. మరో మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి.

ఢిల్లీ బాధితుడికి ఆసుపత్రి చికిత్స్ అందిస్తున్నారు. మే నెలలో ప్రతివారం ఇద్దరు ముగ్గురు అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. ఇప్పుడు ప్రతిరోజూ రెండు మూడు నమూనాలను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కోసం 16 లేబొరేటరీలు పనిచేస్తున్నాయి. అందులో రెండు కేరళలోనే ఉన్నాయి.