Parliament : ఢిల్లీలోని పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం భద్రతా వైఫల్యం చోటుచేసుకోగా.. ఈవిషయం ఆలస్యంగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే..
We’re now on WhatsApp. Click to Join
శుక్రవారం మధ్యాహ్నం టైంలో ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున ఉన్న పార్లమెంటు(Parliament) గోడ దూకి ఓ 20 ఏళ్ల యువకుడు లోపలికి చొరబడ్డాడు. అతడు నడుస్తూ పార్లమెంటు అనెక్స్ భవనం పరిసరాల వద్దకు చేరుకున్నాడు. ఆ యువకుడిని చూసిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని చెక్ చేశారు. అతడి వద్ద ఏవైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే అనుమానంతో తనిఖీలు చేశారు. అయితే ఆ యువకుడి వద్ద అలాంటివి ఏవీ లేదని తేలింది. దీంతో అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. సదరు యువకుడి పేరు మనీశ్ అని.. ఉత్తరప్రదేశ్ వాస్తవ్యుడని సీఐఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. అంత ఎత్తుగా ఉన్న పార్లమెంటు గోడను మనీశ్ ఎలా ఎక్కాడు? ఎందుకు పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించాడడు ? అనే దానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనీశ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ప్రాథమికంగా గుర్తించారు.
Also Read :Monthly Interest Income : ప్రతినెలా వడ్డీ ఆదాయం కావాలా ? ఇవిగో టాప్ సేవింగ్స్ స్కీమ్స్
గతేడాది కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి ఇద్దరు యువకులు దూకిన ఘటన కలకలం రేపింది. దీంతో పార్లమెంటులోని పబ్లిక్ గ్యాలరీలోకి అనుమతి పొందే వ్యక్తుల నేపథ్యం గురించి దర్యాప్తు జరగడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా పబ్లిక్ గ్యాలరీ ప్రాంతంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. ఇకపై అలా జరగకుండా చాలా వరకు పార్లమెంటు భద్రతా నియమాలను రూపొందించారు. ఇక పార్లమెంటు భద్రత బాధ్యతను సీఐఎస్ఎఫ్‌కు అప్పగించారు. పార్లమెంటులోకి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా నియంత్రించేందుకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు క్యాంపస్‌లోని ప్రతీ ప్రాంతాన్ని, అన్ని భవనాలపై నిఘాపెట్టే సీసీ కెమెరాలను కంట్రోల్ చేసిన సీసీటీవీ సర్వైలైన్స్ రూం కూడా ఉంది. దానిలోని సిబ్బంది నిరంతరం అన్ని విభాగాలను నిశితంగా పరిశీలిస్తుంటారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ఆ ఏరియాలోని సెక్యూరిటీ టీమ్స్‌కు సమాచారాన్ని చేరవేస్తుంటారు.