Delhi Murder: ఢిల్లీలో దారుణ ఘటన.. ప్రియురాలిని చంపి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన ప్రియుడు

ప్రియురాలిని హతమార్చిన (Kills)ప్రియుడు ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఉదంతం దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మళ్లీ తెరపైకి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Son Killed Father

Crime Scene

ప్రియురాలిని హతమార్చిన (Kills)ప్రియుడు ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఉదంతం దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మళ్లీ తెరపైకి వచ్చింది. నజఫ్‌గఢ్‌లోని మిత్రోన్ గ్రామ శివార్లలోని ధాబాలో తన 24 ఏళ్ల ప్రియురాలిని చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తెరపైకి వచ్చినప్పుడు, ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని శ్రద్ధా వాకర్ హత్య కేసును ప్రజలు గుర్తు చేసుకున్నారు.

ఢిల్లీ పోలీసు అధికారుల ప్రకారం.. చనిపోయిన మహిళ ఉత్తమ్ నగర్ నివాసి. అదృశ్యమైన వార్త పోలీసులకు అందింది. అనుమానం ఆధారంగా సౌత్-వెస్ట్ ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో ధాబా నడుపుతున్న సాహిల్ గెహ్లాట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో మహిళ హత్య రహస్యం మొత్తం బయటపెట్టాడు. అలాగే దాబాలోని ఫ్రిజ్‌లో మృతదేహం ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోలీసు అధికారి విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహాన్ని పరిశీలిస్తే హత్య 2, 3 రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని అన్నారు. మృతురాలితో తనకు సంబంధం ఉందని సాహిల్ విచారణలో పోలీసులకు చెప్పాడు.

Also Read: Rape Case : గురుగ్రామ్‌లో దారుణం.. మ‌త్తుమందు ఇచ్చి మ‌హిళా టెక్కీపై అత్యాచారం

ఇదిలావుండగా సాహిల్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారం అతని ప్రియురాలికి తెలిసింది. ఆమె దానిని వ్యతిరేకిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని సాహిల్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ కారణంగానే కోపంతో ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిపెట్టాడు. మరో రెండు రోజుల్లో మృతదేహాన్ని వేరే చోట ఉంచేందుకు సిద్ధమయ్యాడు కూడా. హత్యానేరం కింద సాహిల్‌ను పోలీసులు అరెస్టు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

  Last Updated: 15 Feb 2023, 10:05 AM IST