Site icon HashtagU Telugu

Delhi Liquor Case: ఆప్ కు బిగ్ రిలీఫ్.. ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్

Delhi Liquor Case

Delhi Liquor Case

Delhi Liquor Case: ఢిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ సమయంలో సంజయ్ సింగ్ బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నారా అని కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది. అయితే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెప్పడంతో సుప్రీంకోర్టు సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆరు నెలల తర్వాత సంజయ్ సింగ్ జైలు నుంచి బయటకు రానున్నారు.

ఢిల్లీ ఎక్సైజ్‌ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయిన తర్వాత ఆప్ కు తొలిసారిగా రిలీఫ్‌ వచ్చింది. లిక్కర్ కేసులో మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతున్న ఈడీ అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ పిబి వరాల్ ఎంపీ బెయిల్ పై విచారణ చేపట్టారు. గతేడాది డిసెంబరు 22న రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తన పిటిషన్‌ను తోసిపుచ్చిన తర్వాత జనవరి 4న బెయిల్ కోరుతూ సంజయ్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

We’re now on WhatsAppClick to Join

కాగా ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ఢిల్లీ ఆప్ మంత్రి అతిషి స్వాగతించారు. హిందీలో “సత్యమేవ జయతే” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతలను అరెస్టు చేశారు.

Also Read: Dj Tillu 2 : టిల్లు కు సండే లేదు..మండే లేదు..అదే దూకుడు