Arvind Kejriwal Bail: బిగ్ ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ క్యాన్సల్

ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు గురువారం దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే శుక్రవారం ఈ బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.

Arvind Kejriwal Bail: ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు గురువారం దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే శుక్రవారం ఈ బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధించాలని ఈడీ హైకోర్టులో డిమాండ్‌ చేసింది. దీనిపై కేసు విచారణ వరకు అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది.

ఢిల్లీలోని మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. జూన్ 2న ముగిసిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి అతనికి 20 రోజుల బెయిల్ లభించింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ జైలులో లొంగిపోయారు. కాగా జూన్ 20, గురువారం నాడు అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి బెయిల్ లభించింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీలో సంతోషం వెల్లివిరిసింది. చాలా మంది ఆప్ నేతలు దీనిని విజయంగా అభివర్ణించారు. కానీ ఒక్కసారిగా వారి ఆశలకు ఈడీ అడ్డుకట్ట వేసింది.

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఢిల్లీ హైకోర్టుకు హాజరయ్యారు. అయితే స్టే అనంతరం ఆయన మాట్లాడుతూ.. బెయిల్ నిర్ణయంపై స్టే విధించాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని ఏఎస్జీ ఎస్వీ రాజు తెలిపారు. మాకు పూర్తిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇవ్వలేదని రాజు అన్నారు. కాగా కేజ్రీవాల్ బెయిల్ అంశమై మరికాసేపట్లో విచారణ జరగనుంది.

Also Read: Price Hike: కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు.. మరోసారి ట’మోత’..!