Delhi Liquor Scam Update : ఆ ఐదు టీవీ ఛానెల్స్ కు హైకోర్టు నోటీసులు…!!

  • Written By:
  • Publish Date - November 21, 2022 / 07:34 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం పలు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలు మీడియాలో లీక్ అవ్వడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల తీరుపై విచారణ చేపట్టింది కోర్టు. అయితే ఈ స్కాం కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పత్రికా ప్రకటన ఇవ్వలేదంటూ ఈడీ కోర్టుకు తెలిపింది. కానీ సీబీఐ మూడు ప్రకటనలు చేసినట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది.

ఈ అంశంపై స్పందించిన కోర్టు…సీబీఐ ప్రకటనలకు …మీడియా కథనాలకు సంబందం లేదన్నది. ఈ క్రమంలోనే 5 టీవీ ఛానెళ్లకు నోటీసులు పంపించింది ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం. ఇందులో రిపబ్లిక్ టవీ, టైమ్స్ నౌ, ఏఎన్ఐ, ఇండియా టుడే, జీన్యూస్ లకు నోటీసులు జారీ చేసింది. తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కోర్టు ఆక్షేపించింది. ఈ ఐదు చానళ్ల వార్తలను పరిశీలించాని ఎన్బీడీఎస్ఏకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీవీ ఛానెళ్ల ప్రసారాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి తమకు తెలియజేయాలని చెప్పింది. ఈడీ, సిబిఐ జారీ చేసిన అధికారిక ప్రకటనల ఆధారంగానే ప్రసారం చేయాలని ఆయా టీవీ ఛానెళ్లకు కోర్టు దిశానిర్దేశం చేసింది.