Site icon HashtagU Telugu

Delhi High Court అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నా…కేసు అలానే ఉంటుంది..!!

Delhi High Court

Delhi High Court

ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిందితుడిపై నమోదైన కేసు తొలగిపోదని స్పష్టంచేసింది. కాబట్టి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ కేసు పూర్వాపరాలు చూస్తే…నవంబర్ 2019లో 27 ఏళ్ల నిందితుడు 14 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేశాడు. బాలికపై అత్యాచారం చేశాడు. రెండు సంవత్సరాల తర్వాత అక్టోబరు 2021లో నిందితుడి ఇంటి దగ్గర బాధిత బాలిక కనిపించింది. అప్పటికి 8నెలల క్రితం బాధిత బాలిక పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చింది.

బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసుల్లో బాధిత బాలిక అంగీకరించిందా లేదా అన్నదానితో సంబంధం లేదని పేర్కొంది కోర్టు. ఒకవేళ బాలిక తెలివతక్కవ తనంతో దానికి అంగీకరించినా…చట్టం ప్రకారం దానికి గుర్తింపు లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం.

Exit mobile version