CM Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఎదుట విచారణకు రానుంది.
ఢిల్లీకి ఎక్సైజ్ పాలసీకి సంబందించిన కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీఎం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నారు. కాగా కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి విధులను నిర్వహించడంలో అసమర్థతకు గురయ్యారని సందీప్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం జైలు నుండి ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పటికీ పనిచేయలేరని పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు గతంలో తిరస్కరించింది. ఏప్రిల్ 4న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ మరియు జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పిఐఎల్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగడం కేజ్రీవాల్ వ్యక్తిగత అంశమని పేర్కొంది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాను వెంటనే రాజీనామ చేయాల్సిందిగా పట్టుబడుతోంది. మరోవైపు కేజ్రీవాల్ జైలు నుంచే పాలన అందిస్తారని ఆప్ పేర్కొంటున్నది.
Also Read: Allu Arjun : బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పేందుకు.. అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్