Anil Ambani : అయ్యో అనిల్ అంబానీ.. రూ.1100 కోట్ల కష్టం !

Anil Ambani : ఓ వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Best Hospitals

Best Hospitals

Anil Ambani : ఓ వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. మరోవైపు ముఖేష్ అంబానీ తమ్ముడు  అనిల్ అంబానీ మనీ గ్రాఫ్ అమాంతం పడిపోతోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జాంనగర్‌లో మూడు రోజుల పాటు జరిగింది. దీనికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చయ్యాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు అనిల్ అంబానీని(Anil Ambani) మరిన్ని సమస్యల్లోకి నెట్టేశాయి.  అనిల్‌కు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించిన రూ.1,100 కోట్లు విలువైన ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడం లేదా తాకట్టు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు బ్యాన్ విధించింది.

We’re now on WhatsApp. Click to Join

  • 2008 సంవత్సరంలో సాసన్ పవర్ ప్రాజెక్టుకు పరికరాలను సరఫరా చేసేందుకు సంబంధించి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, చైనా కంపెనీ షాంఘై ఎలక్ట్రిక్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది.
  • ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు షాంఘై ఎలక్ట్రిక్ గ్రూప్.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దావా వేసింది.
  • దీంతో షాంఘై కంపెనీకి రూ.120 కోట్ల పరిహారం చెల్లించాలని అనిల్ అంబానీ కంపెనీని సింగపూర్ కోర్టు ఆదేశించింది.
  • 2022లో సింగపూర్ కోర్టు తీర్పుకు అనుగుణంగా మధ్యంతర ఉపశమనంగా మొత్తాన్ని అందించాలని కోరుతూ షాంఘై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి విచారించారు. ఇందులో కంపెనీ అభ్యర్థనను అంగీకరించడానికి షాంఘై నిరాకరించింది.
  • ఈ నేపథ్యంలో షాంఘై కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అనిల్ అంబానీ కంపెనీకి చెందిన రూ.1,100 కోట్లకుపైగా ఆస్తుల అమ్మకం, బదిలీ జరపకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.
  • కోర్టు ఆదేశం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుందని అనిల్ అంబానీ వర్గం ఆందోళన చెందుతోంది.
  • అనిల్ అంబానీ ఒకప్పుడు బిలియనీర్ల జాబితాలో ఉండేవారు. ఈ వ్యాపారవేత్త సంపదలు కోల్పోయి ప్రస్తుతం సాధారణ వ్యక్తిలా మారిపోయారు. బయటి కార్యక్రమాల్లో సైతం అనిల్ అంబానీ పెద్దగా కనిపించటం లేదు.
  • అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ భారతదేశంలో రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ అంబానీ కుమారులు.
  • ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అనిల్ అంబానీ ఆరో స్థానంలో నిలిచారు.
  • అనిల్ నికర విలువ రూ.1.83 లక్షల కోట్లుగా ఉండేది. ఆ మహా వ్యాపార సామ్రాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోవటంతో కొన్నేళ్ల కిందట వ్యాపారవేత్త అనిల్ అంబానీ దివాలా తీశారు.

Also Read :Hyderabad Metro : అమెరికా యూనివర్సిటీలో హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ

  Last Updated: 11 Mar 2024, 08:49 AM IST