Kejriwal: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగు: కేజ్రీవాల్

  • Written By:
  • Updated On - December 11, 2023 / 04:39 PM IST

Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సివిల్ లైన్స్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు ఏ టాప్ ప్రైవేట్ సంస్థ కంటే తక్కువ కాదని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. భారతదేశానికి  ఇండిపెండెన్స్ వచ్చిన 15-20 సంవత్సరాల కాలంలో చాలా మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు.

విద్యే తమ ప్రభుత్వ ప్రధానాంశమని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు గత ఎనిమిదేళ్లలో పరివర్తన చెందాయని అన్నారు. ఇతర పార్టీలు ఆప్ హామీలు, ఎజెండాను కాపీ కొడుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అగ్రశ్రేణి ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లోని వారి కంటే వారు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు మానేసిన వారి సంఖ్య గతంలో ఎక్కువగానే ఉందని, అయితే ఈ సమస్యను పరిష్కరించామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు.