Site icon HashtagU Telugu

Delhi Exit Poll Results 2025 : KK సర్వే ఏమంటుందంటే..!!

Delhi Exit Polls 2025

Delhi Exit Polls 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత కొన్ని నెలలుగా సాగుతున్న రాజకీయ పోరుకు తెరపడింది. ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (INC) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రజలు తమ ఓటుతో ఏ పార్టీకి పట్టం కట్టారో తెలియాలంటే ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ లోపు Exit Poll సర్వే లు ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా అంచనా వేసాయి. ముఖ్యంగా KK సర్వే సక్సెస్ సాధించింది. మరికొన్ని సంస్థలు మాత్రం అంచనా వేయడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా నిజానికి దగ్గరగా ఉంటాయా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, నిజమైన ఫలితాలు అధికారికంగా వెలువడేంత వరకు ఎగ్జిట్ పోల్స్ కేవలం ఊహాగానాలేనన్న విషయం మర్చిపోవద్దు. ఇక ఢిల్లీ ఫలితాలపై ఇప్పటివరకు నమోదైన ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Poll Results 2025) ఏమంటున్నాయో చూద్దాం.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు :

కేకే సర్వే :

బీజేపీ-22
ఆప్-39
కాంగ్రెస్-

జేవీసీ పోల్ :

బీజేపీ – 39-45 సీట్లు
ఆప్ – 22-31 సీట్లు
కాంగ్రెస్ – 0-2 సీట్లు
ఇతరులు – 0-1 సీట్లు

పీపుల్స్ పల్స్ :

బీజేపీ – 51-60 సీట్లు
ఆప్ – 10-19 సీట్లు
కాంగ్రెస్ – 0

ఏబీపీ మ్యాట్రిజ్ :

బీజేపీ – 35-40 సీట్లు
ఆప్ – 32-37 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు

రిపబ్లిక్ పీ మార్క్ :

బీజేపీ – 39-49 సీట్లు
ఆప్ – 21-31 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు

ఢిల్లీ టైమ్స్ నౌ :

బీజేపీ – 39-45 సీట్లు
ఆప్ – 22-31 సీట్లు
కాంగ్రెస్ –

ఆత్మసాక్షి :

బీజేపీ – 38-41 సీట్లు
ఆప్ – 27-30 సీట్లు
కాంగ్రెస్ – 1-3 సీట్లు

చాణిక్య స్ట్రాటజీస్ :

బీజేపీ – 39-44 సీట్లు
ఆప్ – 25-28 సీట్లు
కాంగ్రెస్ –

పీపుల్స్ ఇన్‌సైట్ :

బీజేపీ – 40-44 సీట్లు
ఆప్ – 25-29 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు