Site icon HashtagU Telugu

Delhi Excise Scam : ఢిల్లీ లిక్క‌ర్‌ కేసులో మూడ‌వ ఛార్జీషీట్ వేసిన ఈడీ

Enforcement Directorate

Enforcement Directorate

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారులు అరుణ్ పిళ్లై, అమన్‌దీప్ ధాల్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఢిల్లీ కోర్టులో మూడో అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. సౌత్ గ్రూప్‌కు అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అభిషేక్ బోయిన్‌పల్లి, AAP కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్, అతని సహచరుడు దినేష్ అరోరాతో కుమ్మక్కుఅయి..కుట్రతో రూ.100 కోట్లు చేతులు మారాయ‌ని తెలిపింది. మార్చి 2న బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ధాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూప్ ద్వారా ఫార్ములేషన్, కిక్‌బ్యాక్‌లు చెల్లించడంలో ధల్ ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపించారు. మద్యం పాలసీ విడుదలకు ముందే దానికి సంబంధించిన ముసాయిదా కాపీ ఆయనకు అందింది. ధాల్ డ్రాఫ్ట్ కాపీని బినోయ్ బాబుతో పంచుకున్నారని ఆరోపించారు. అతను సౌత్ గ్రూప్ వ్యక్తులు, నాయర్ మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా ED ఆరోపించింది. ఆప్ నేతల తరపున నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల మేర కిక్‌బ్యాక్‌లు పొందారని, వీరి ప్రముఖ వ్యక్తులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ మాగుంట, శరత్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత అని ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.