Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: సిసోడియా బెయిల్ పిటిషన్ పై ముగిసిన విచారణ

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కాగా… ఏప్రిల్ 26 సాయంత్రం 4 గంటలకు కోర్టు తీర్పు వెలువరించనుంది.

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన ED కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారించారు. ఈ సందర్భంగా సిసోడియా తరఫు న్యాయవాది మాట్లాడుతూ… మంత్రుల బృందం, కేబినెట్‌లో ఏం జరిగిందో చెప్పడం ఈడీ పని కాదని అన్నారు. ఏదైనా నేరం జరిగితే దాని వల్ల ఎవరు లాభపడ్డారో చెప్పడమే ED పని అని స్పష్టం చేశారు. కేవలం ఊహాగానాల ఆధారంగా సిసోడియాను కస్టడీలో ఉంచలేమని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది దయన్ కృష్ణన్ అన్నారు. సిసోడియాపై మనీలాండరింగ్ కేసు లేదు. ఈడీ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ రోజు పూర్తయిందని తెలిపారు. కాగా… ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. ఏప్రిల్ 26న సాయంత్రం 4 గంటలకు మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులపై కోర్టు తీర్పు వెలువరించనుంది.

అంతకుముందు ఏప్రిల్ 12న మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో వాదనలు వినిపించింది. ఎక్సైజ్ పాలసీని సవరించి అమలు చేయడంలో మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. విశేషమేమిటంటే గతంలో సీబీఐ కేసులో ప్రత్యేక కోర్టు మార్చి 31న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మనీష్ సిసోడియా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Read More: Sleep Tips: రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయాల్సిందే?