Lalu Prasad : రైల్వే ఉద్యోగాల స్కాంలో లాలూకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు

అక్టోబరు 7లోగా తమ ఎదుట హాజరుకావాలని వారిద్దరిని న్యాయస్థానం(Lalu Prasad) ఆదేశించింది.

Published By: HashtagU Telugu Desk
Lalu Prasad land for jobs Scam

Lalu Prasad : గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన బిహార్‌కు చెందిన కొందరు యువతకు రైల్వే ఉద్యోగాలను కట్టబెట్టేందుకు వారి నుంచి భూమిని లంచంగా పుచ్చుకున్నారనే అభియోగాలతో మనీలాండరింగ్ కేసు నమోదైంది. దాన్ని తాజాగా ఇవాళ విచారించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లకు  సమన్లు జారీ చేసింది. అక్టోబరు 7లోగా తమ ఎదుట హాజరుకావాలని వారిద్దరిని న్యాయస్థానం(Lalu Prasad) ఆదేశించింది. వీరిద్దరితో పాటు ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ప్రతాప్ యాదవ్‌కు, మరికొందరికి కూడా కోర్టు సమన్లను జారీ చేసింది.

Also Read :Lunar Eclipse : ఇవాళ చంద్రగ్రహణం.. వచ్చే నెలలో సూర్యగ్రహణం.. పండితులు ఏమంటున్నారు ?

కేసు పూర్వాపరాలు ఇవీ.. 

  • లాలూ ప్రసాద్ బిహార్ రాజకీయాల్లో ఒక సంచలనం.
  • ఆయన పార్టీ చాలా దశాబ్దాలు బిహార్‌లో ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. దీంతో కేంద్రంలోని యూపీఏ సర్కారులోనూ ఆయన చక్రం తిప్పారు.
  • ఈక్రమంలోనే 2004 నుంచి 2009  వరకు రైల్వే మంత్రిగా సేవలు అందించే కీలక అవకాశం లాలూకు లభించింది.
  • ఆ టైంలో రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇదే అదునుగా ఆయన ఉద్యోగాల ఆశచూపి యువత నుంచి డబ్బులు దండుకున్నారనే అభియోగాలతో సీబీఐ చాలా ఏళ్ల క్రితమే మనీలాండరింగ్  కేసు నమోదు చేసింది.
  • గత సంవత్సరం మార్చి నెలలో ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు బిహార్ రాష్ట్రంలో పలు చోట్ల రైడ్స్ కూడా సీబీఐ చేసింది.
  • మరోవైపు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లింది.
  • లాలూ సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్‌, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్‌లతో పాటు ఏకే ఇన్ఫో సిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌ అనే సంస్థలను నిందితుల లిస్టులో చేర్చి ఈడీ ఛార్జిషీట్‌ను తయారు చేసింది.
  • ఈడీ తుది నివేదికను ఆగస్టు 6న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించింది.
  • ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తాజాగా ఆదేశాలను జారీచేసింది. లాలూ, తేజస్విలకు సమన్లు ఇష్యూ చేసింది.

Also Read :Blindsight Device : అంధులకు చూపును ప్రసాదించే పరికరం.. ప్రయోగానికి న్యూరాలింక్‌ రెడీ

  Last Updated: 18 Sep 2024, 01:43 PM IST