National Herald case: ఢిల్లీ పటియాలా హైకోర్టు నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ , రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. దీనిపై తదుపరి విచారణను మే8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు పరిశీలన దశలో ఉంది. నిందితులపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
Read Also: Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
గతవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈడీ సమర్పించిన ఛార్జిషీట్‌లో సరైన పత్రాలు లేని కారణంగా రాహుల్, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ చర్యలు తీసుకుంది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితులను విచారించకుండా ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని.. కాబట్టి విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఇటీవల దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, దివంగత పార్టీ నేతలు మోతీలాల్ వోరా ,ఆస్కార్ ఫెర్నాండెజ్ వంటి కీలక కాంగ్రెస్ ప్రముఖులు, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీలు మనీలాండరింగ్ కు కుట్ర చేశారని ఆరోపించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికలో మనీలాండరింగ్ జరిగిందని 2014లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను కోర్టు పరిశీలించిన తర్వాత 2021లో ఈడీ దర్యాప్తుకు ప్రారంభించింది. ఇటీవల ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఆస్తులున్న ప్రాంతాల్లో (దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ) భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లతో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
Read Also: PM Modi : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ