Site icon HashtagU Telugu

Land for Job Scam : లాలూకు బెయిల్

Lalu Land for job scam case

Lalu Land for job scam case

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసు ( Land for Job Scam)లో బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయగా.. లాలూ, తేజశ్వి, మనోజ్‌ ఝా కోర్టుకు హాజరయ్యారు. లాలూతో పాటు భార్య రబ్రీదేవి(Rabri Devi), కుమారుడు తేజశ్వి(Tejashwi Yadav) అలాగే ఆర్జేడీ ఎంపీ మీసా భారతీలకు కూడా బెయిల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై ఆయనతోపాటు మరో 15 మందిపై గతేడాది మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్‌ను దాఖలు చేయగా, ఈ ఏడాది జులై 3న మరో ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఏడాది సెప్టెంబరు 22న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ దిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. బుధవారం లాలూ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ గీతాంజలి గోయల్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also : TDP : వారాహిలో అల్లర్లు సృష్టిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.. వైసీపీకి టీడీపీ నేత య‌ర‌ప‌తినేని హెచ్చరిక‌

Exit mobile version