Land For Jobs Case : ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జేడీ చీఫ్, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జస్టిస్ విశాల్ గోగ్నే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పూచీకత్తు కింద రూ.1లక్ష చెల్లించడంతో పాటు, వారి ముగ్గురి పాస్‌పోర్ట్‌లను సరెండర్ చేయాలని ఆదేశించారు. కేసు విచారణ సమయంలో వారిని అరెస్టు చేయకూడదని పేర్కొంది.
Read Also: Ola Shares : సోషల్ మీడియాలో కస్టమర్ల గోడు.. ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర డౌన్
కాగా, ఈ కేసులో అక్టోబర్ 25వ తేదీన తదుపరి విచారణ ఉండనున్నది. అక్టోబర్ 7వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆర్జేడీ నేతలు ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ .. రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన రిక్రూట్మెంట్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు కోరిన బాధితుల నుంచి భూమి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగ నియామకాల సమయంలో రైల్వేశాఖ రూల్స్‌ను ఉల్లించిందని, ప్రమాణాలకు తగినట్లు నియామకాలు జరగలేదని సీబీఐ తన రిపోర్టులో తెలిపింది. ఇదే కేసులో ఢిల్లీ కోర్టు 2023 మార్చిలో లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవీ, కూతురు మీసా భారతిలకు బెయిల్ మంజూరీ చేసింది.
Read Also: PM Modi : ‘గర్బా’ నృత్యంపై పాట రాసిన ప్రధాని మోడీ