Site icon HashtagU Telugu

Kavitha ED Custody : ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడగింపు

Kavitha Delhi

Kavitha Delhi

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam) లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కు భారీ షాక్ ఇచ్చింది కోర్ట్. ఈరోజుతో కవిత ఈడీ కస్టడీ (Custody of ED) ముగియగా అధికారులు ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఇక కవిత యథావిధిగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోయింది. ఇది పూర్తిగా రాజకీయ కల్పిత కేసు అని పేర్కొన్నారు. ఏడాది క్రితం ఈడీ తనను ఏయే ప్రశ్నలు అడిగిందో.. ఇప్పుడు కూడా అవే ప్రశ్నలు అడిగారని చెప్పారు. తన అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తానన్నారు. పిల్లల్ని కలిసేందుకు అనుమతివ్వాలని కవిత తరపు లాయర్ న్యాయస్థానాన్ని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కవిత పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలిచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రికార్డ్స్ రిపోర్ట్స్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అరెస్ట్ అయిన 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్‌తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్ విషయాన్ని తన న్యాయవాదికి కవిత తెలిపారు. ఆ విషయాన్ని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కవిత తరపు న్యాయవాదులకు మెడికో లీగల్ రిపోర్ట్ అందించాలని ఈడీని న్యాయమూర్తి ఆదేశించారు.

Read Also : Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్