Arvind Kejriwal : 2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్..ఆప్ నేత కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal ED Arrest : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్​తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ(bjp) భయపడుతోందని ఆమ్​ ఆద్మీ పార్టీ (aap) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌(Kejriwal)ను అరెస్టు చేసేందుకు ఈడీ(ED)తో పాటు సీబీఐ(cbi)ని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సీఆర్​పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే […]

Published By: HashtagU Telugu Desk
Delhi Cm Will Be Arrested In Next 2 3 Days, Says Aap's Saurabh Bharadwaj

Delhi Cm Will Be Arrested In Next 2 3 Days, Says Aap's Saurabh Bharadwaj

Arvind Kejriwal ED Arrest : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్​తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ(bjp) భయపడుతోందని ఆమ్​ ఆద్మీ పార్టీ (aap) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌(Kejriwal)ను అరెస్టు చేసేందుకు ఈడీ(ED)తో పాటు సీబీఐ(cbi)ని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని తెలిపింది.

కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సీఆర్​పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే నోటీసులు కూడా సిద్ధమయ్యాయని తమ వద్ద సమాచారం ఉందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్​ తెలిపారు. అందుకే కాంగ్రెస్ – ఆప్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ముగిసినట్లు నివేదికలు రాగానే, కేజ్రీవాల్​కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయన్న వార్తతో బీజేపీకి నిద్ర పట్టడం లేదని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.

కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ప్రజలు వీధుల్లోకి వస్తారని, ప్రజా సునామీ వస్తుందని, అందులో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ హెచ్చరించారు. బీజేపీ రాజకీయ సమీకరణాలు తప్పుతాయని జోస్యం చెప్పారు. అరెస్టులకు తాము భయపడటం లేదని, దేశం కోసం కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్, ఆప్​ కలిసి పోరాడే రాష్ట్రాల్లో బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ భావిస్తోందని ఆప్​ విమర్శించింది. తాము 300, 370, 400పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉంటే ఇక భయం ఏందుకు? అని ప్రశ్నించింది. 400 సీట్లు గెలిచే పార్టీ లక్షణాలు ఇలా ఉండవని ఎద్దేవా చేసింది.

2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు పర్యాయాలు ఆప్​ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక 2009లో కాంగ్రెస్ మొత్తం 7 సీట్లు గెలుచుకుంది. అంతకుముందు 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​కు 6 సీట్లు రాగా, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.

read also : AP Congress : ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఫిక్స్..

  Last Updated: 23 Feb 2024, 01:20 PM IST