Site icon HashtagU Telugu

Kejriwal in Kerala: దక్షిణాదిలో పాగాకు నరేంద్రమోదీ ప్లాన్ నే కేజ్రీవాల్ కాపీ కొట్టారా?

Arvind Kejriwal

Arvind Kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ మంచి జోరు మీదుంది. పంజాబ్ ఎన్నికల్లో ఇచ్చిన విజయం పార్టీకి బూస్ట్ ఇచ్చింది. అందుకే అదే ఉత్సాహంతో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్ని్స్తోంది. ఇప్పటికే పార్టీ జాతీయ కన్వీనర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై రిపోర్టులు తెప్పించుకున్నారు. వాటిలో కాస్త తమకు అనుకూలంగా ఉన్నవాటిని గుర్తించారు. గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్..ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్ కు రాజకీయ వాతావరణం కాస్త సానుకూలంగానే కనిపించినట్లుంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో పాగా వేయడానికి స్కెచ్ వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన ఆ రాష్ట్రాల ఓటర్లను ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు.

దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే.. కేరళ, కర్ణాటకలో జాతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఆదివారం కేరళలో పర్యటించిన కేజ్రీవాల్ కు అక్కడ పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినట్టున్నాయి. అందుకే అక్కడ ఉన్న ట్వంటీ ట్వంటీ పార్టీతో జతకట్టారు. ఈ రెండు పార్టీలు కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ గా ఏర్పడ్డాయి.

2014 ఎన్నికల్లో ఎలాగైతే నరేంద్రమోడీ… గుజరాత్ మోడల్ అని ప్రచారం చేసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారో.. అదే సూత్రాన్ని కేజ్రీవాల్ పాటిస్తున్నట్టు ఉంది. అందుకే ఢిల్లీ మోడల్ అభివృద్ధిని చేస్తామని చెబుతూ కేరళ ఓటర్లను ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే తమ కూటమికి విజయాన్ని అందించి ఆశీర్వదించాలన్నారు. కేరళ ఓటర్లు కరుణిస్తే.. ఢిల్లీ మాదిరి కేరళలో కూడా 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తామన్నారు కేజ్రీవాల్. మొత్తానికి దక్షిణాదిలో పాగా వేయడానికి కేజ్రీవాల్ పక్కా స్కెచ్ వేశారని అర్థమవుతోంది.

Exit mobile version