Site icon HashtagU Telugu

Dry Day On Chhath Puja 2023 In Delhi : ఢిల్లీ లో వైన్ షాప్స్ బంద్..ఎందుకంటే …

Wine Shops Tenders Income for Telangana almost 2500 crores above

Wine Shops Tenders Income for Telangana almost 2500 crores above

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నవంబర్ 19 న వైన్ షాపులు బంద్ (Wine Shops Bandh) చేస్తున్నారు. 19 న ఉత్తర భారత్‌లో ఛాత్ పూజ పండుగ (Chhath Puja 2023) ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 19 న ఢిల్లీ నగరమంతా లిక్కర్ షాపులు బంద్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఆరోజును డ్రై డే (Dry Day)గా ప్రకటించారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో ప్రతి మూడు నెలలకు ఒక సారి ఎక్సైజ్ శాఖ డ్రై డే ప్రకటిస్తూ వస్తున్నది. 19 న వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబులు ఇప్పటి నుండే మందును తెచ్చుకొని దాచుకుంటున్నారు.

ఛాత్ పూజ ను కార్తీకమాసం శుక్ల షష్ఠి నాడు జరుపుకుంటారు. షష్టినాడు జరుపుకునే పండుగ, సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్య షష్ఠి అంటారు. కొందరు ఈ ఛాత్ పూజను కార్తీక షష్ఠికి రెండు రోజులు మొదలుపెట్టి, రెండురోజుల తర్వాతి వరకు అంటే నాలుగురోజులపాటు జరుపుకుంటారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఛాత్ పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు. కొందరైతే దీక్షను 36 గంటల పాటు కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఛాత్ పూజ జరుపుకున్నవారు కపటం లేకుండా నిజాయితీగా ఉంటారు. ఆడంబరాలకు దూరంగా గడుపుతారు. మంచంమీద కాకుండా నేలమీద ఒక దుప్పటి పరచుకుని పవళిస్తారు. పాండవులు, ద్రౌపది ఛాత్ పూజ చేసినట్లు మహాభారతంలో కథనాలు ఉన్నాయి.

బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. మనదేశంలో సంస్కృతీ సంప్రదాయాలు కొంతవరకూ తగ్గుతుండగా ఇక్కడినుండి వెళ్ళి ఇతర దేశాల్లో నివసిస్తున్న మనవాళ్ళు హిందూ పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఛాత్ పూజను సైతం విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు వేడుక చేసుకుంటున్నారు.

Read Also : Sunny Leone : సన్నీలియోన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది