Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఒక వాహనంలో పేలుడు (Delhi Blast) సంభవించింది. ఒక కారులో పేలుడు జరిగిందని సమాచారం. ఈ పేలుడులో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి 5 అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. పేలుడు తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట గేట్ నంబర్ 1 సమీపంలో జరిగింది.
ఢిల్లీ పోలీసులు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎర్రకోట వద్ద ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎర్రకోట సమీపంలోనే చాందినీ చౌక్ కూడా ఉంది. అక్కడ పెద్ద మార్కెట్ ఉంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు అక్కడికి వస్తారు.
Also Read: Nara Lokesh : కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం
दिल्ली में ब्लास्ट की तस्वीरें आईं सामने pic.twitter.com/lpez23rNF8
— Raghav Tiwari (@RaghavT85120802) November 10, 2025
ఢిల్లీ అగ్నిమాపక శాఖ (ఫైర్ డిపార్ట్‌మెంట్) తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఒక కారులో పేలుడు సంభవించిందనే సమాచారం అందింది. దాని తర్వాత మూడు నుండి నాలుగు ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకొని నష్టం వాటిల్లింది.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలో పేలుడు వంటి శబ్దం వినిపించినట్లు మాకు సమాచారం అందింది. దీంతో 10 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఒక కారులో పేలుడు సంభవించడం వల్ల చుట్టుపక్కల ఉన్న మూడు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని పరిశీలించడానికి, మంటలను అదుపు చేయడానికి బృందాలను పంపామని పేర్కొంది.
కారు లోపల ఏదైనా పేలుడు పదార్థం ఉందా లేదా ఈ పేలుడుకు మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ఢిల్లీ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఢిల్లీ పోలీసు బృందాలు చేరుకున్నాయి. ఈ పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతం చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ప్రస్తుతం పేలుడు జరిగిన స్థలంలో ట్రాఫిక్ రాకపోకలను నిలిపివేశారు. ఎర్రకోట వద్ద పేలుడు సంభవించిన నేపథ్యంలో ఢిల్లీ అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఎర్రకోట సమీపంలో పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాతే మంటలు చెలరేగాయి. ఎన్‌ఐఏ (NIA), ఎన్‌ఎస్‌జి (NSG) బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని త్వరలో పేలుడుకు గల కారణాన్ని దర్యాప్తు చేయనున్నాయి.
