Site icon HashtagU Telugu

Arvind Kejriwal: నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

Delhi Assembly Session Today, 1st Since Chief Minister Arvind Kejriwal's Arrest

Delhi Assembly Session Today, 1st Since Chief Minister Arvind Kejriwal's Arrest

 

న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) తర్వాత ఢిల్లీ అసెంబ్లీ (assembly-session)నేడు తొలిసారి సమావేశం కానుంది. జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ అన్నట్టే నిన్న జైలు నుంచే రెండో ఆదేశం జారీచేశారు. సర్కారు సారథ్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌లలో ఉచిత మందులు, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.

తాను అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కేజ్రీవాల్ భావిస్తున్నారని, మొహల్లా క్లినిక్‌లలో ప్రజలు మందుల కోసం, పరీక్షల కోసం ఇబ్బంది పడకూడదనే ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉచిత మందులు, పరీక్షలపై నేటి అసెంబ్లీలో చర్చిస్తారు. అలాగే, ప్రతిపక్షాల ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇస్తారు. మొహల్లా క్లినిక్‌ల పరిస్థితి, సీఎం ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది అన్న విషయాలను వివరిస్తారు. కాగా, కేజ్రీవాల్ అంతకుముందు నీటి సరఫరాకు సంబంధించి కస్టడీ నుంచే తొలి ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది.

కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈనెల 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీతోసహా దేశంలోని పలు నగరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన మరుసటి రోజే రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. విచారణ అనంతరం ఈనెల 28వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి పంపింది. అయితే, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సుముఖంగా లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుతానని తెలిపారు. అంతేకాక.. ఆపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలుసైతం కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతాడని తెలిపారు.

Read Also: Klinkara : ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకార కెమెరా కు చిక్కింది