Delhi Exit Polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ (బుధవారం) ముగిసింది. ఈ నేపథ్యంలో ‘చాణక్య స్ట్రాటజీస్’ తాజా ఎగ్జిట్ పోల్స్ సర్వేను విడుదల చేసింది. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నివేదికను ‘చాణక్య స్ట్రాటజీస్’ నిపుణులు రూపొందించారు. ఈ నివేదిక(Chanakya Strategies) ఆధారంగా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలపై మనం ప్రాథమిక అంచనాకు రావచ్చు.
Also Read :Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించిన భారత అంపైర్.. రీజన్ ఇదే!
‘చాణక్య స్ట్రాటజీస్’ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివీ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. ఈ పార్టీ 25 నుంచి 28 అసెంబ్లీ స్థానాలను గెల్చుకునే అవకాశం ఉంది. ఆప్‌కు 40 శాతం కంటే తక్కువ ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో ఆప్ మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి బలమైన పోటీ ఎదురైంది.
బీజేపీ
బీజేపీ ఈ ఎన్నికల్లో 39 నుంచి 44 అసెంబ్లీ స్థానాలను గెల్చుకునే అవకాశం ఉంది. ఈ పార్టీకి 43 శాతానికిపైగా ఓట్లు దక్కే సూచనలు ఉన్నాయి. తద్వారా ఢిల్లీలో బీజేపీ ఈసారి బలమైన ప్రదర్శనను ఇవ్వబోతోంది.
Also Read :Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు..
కాంగ్రెస్
ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 అసెంబ్లీ స్థానాలు గెల్చుకునే అవకాశం ఉంది. ఈ పార్టీకి దాదాపు 10 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రస్తుతం బలహీన స్థితిలోనే ఉంది. అందువల్ల బీజేపీ, ఆప్‌లకు తగిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతోంది.
బీఎస్‌పీ
ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ 3 శాతం కంటే తక్కువ ఓట్లను పొందే అవకాశం ఉంది. కనీసం ఒక్కస్థానాన్ని కూడా బీఎస్‌పీ గెలిచే అవకాశం లేదు.
లెఫ్ట్ కూటమి (CPI & CPM)
సీపీఐ, సీపీఎంలతో కూడిన వామపక్ష కూటమి ఢిల్లీ ఎన్నికల్లో 1.5% కంటే తక్కువ ఓట్లతో ఈసారి సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెల్చుకునే అవకాశం లేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివరాలు
- మొత్తం అసెంబ్లీ స్థానాలు : 70
- పోలింగ్ శాతం (అంచనా) : 68-70%
- ఆప్ పార్టీకి ఓట్ల శాతం(అంచనా) : 37-40%
- బీజేపీకి ఓట్ల శాతం (అంచనా): 43-45%
- ఇతర పార్టీలకు ఓట్ల శాతం (అంచనా) : 4.5% కంటే తక్కువ
ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని తేల్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆప్ కొన్ని అసెంబ్లీ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. దీంతో బీజేపీ పైచేయి సాధించొచ్చు. కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో దారుణంగా చతికిల పడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. ఈ సర్వే అంచనాలు నిజమవుతాయా ? కావా? అనేది ఆ రోజున అందరికీ తెలిసిపోతుంది.