Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీలోకి ఎంపీల నిషేధం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విశ్వాస ప‌రీక్ష సంద‌ర్భంగా అసెంబ్లీలోకి ఎంపీల ఎంట్రీని నిషేధిస్తూ అసెంబ్లీ స‌చివాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 01:25 PM IST

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విశ్వాస ప‌రీక్ష సంద‌ర్భంగా అసెంబ్లీలోకి ఎంపీల ఎంట్రీని నిషేధిస్తూ అసెంబ్లీ స‌చివాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాత్రంతా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌ల‌తో అసెంబ్లీ ఆవ‌ర‌ణ ఉద్రిక్తంగా మారింది. దీంతో పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీల నేతల ప్రవేశంపై నిషేధం విధిస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ మంగళవారం నిర్ణ‌యం తీసుకుంది.
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు 2016 నోట్ల రద్దు ప్రక్రియలో స్కామ్‌కు పాల్పడినందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు. సచివాలయ ఆర్డర్‌తో సంబంధం లేకుండా ఎంపీలందరూ సెషన్‌లో పాల్గొంటారని బీజేపీ నేత, దక్షిణ ఎంపీ రమేష్ బిధూరి అసెంబ్లీ రిసెప్షన్‌కు వచ్చి మీడియా చెప్పారు. అయితే గేటు దగ్గరే వాళ్ల‌ను ఆపారు.
అసెంబ్లీ కాంప్లెక్స్ లోపల అధికార మరియు ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసనలు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని డిప్యూటీ స్పీకర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు ఒక సందర్శకుడు మాత్రమే అసెంబ్లీలోని ప్రవేశించడానికి అనుమ‌తిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యులు , రాజకీయ పార్టీల నాయకులు వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని , ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీలోకి వెళ్ల‌డానికి లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈ ఆర్డర్ కాపీని షేర్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రోహిణి విజేందర్ గుప్తా ట్విట్టర్‌లో “కేజ్రీవాల్ ప్రభుత్వం భయపడుతోంది! ఢిల్లీ ఎంపీల ప్రవేశంపై నిషేధం విధించారు. అంటూ వ్యాఖ్యానించారు. ఆరేళ్ల నాటి కేసులో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై విచారణ జరిపించాలని ఆప్ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండగా, మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 2016లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో సక్సేనా రూ.1,400 కోట్ల విలువైన నోట్ల రద్దు చేసిన కరెన్సీ నోట్ల మార్పిడి కోసం ఇద్దరు తన కింది అధికారులపై ఒత్తిడి తెచ్చారని అధికార పార్టీ ఆరోపించింది.