Delhi Airport : ప్లీన‌రీకి వెళ్లే లీడ‌ర్ల‌పై పోలీసింగ్‌, విమానం నుంచి ప‌వ‌న్ దించివేత‌!

కాంగ్రెస్ ప్లీన‌రీకి వెళుతోన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి,

  • Written By:
  • Updated On - February 23, 2023 / 01:48 PM IST

కాంగ్రెస్ ప్లీన‌రీకి వెళుతోన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, పార్ల‌మెంట్ వేదిక‌గా హిడెన్ బ‌ర్గ్ నివేదిక‌పై `జేపీసీ`ని డిమాండ్ చేసిన ప‌న‌న్ ఖేరాకు ఢిల్లీ విమానాశ్ర‌యంలో(Delhi Airport) ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న్ను విమానం నుంచి దింపేస్తూ పోలీసులు,(Police) ఎయిర్ లైన్ నిర్వాహ‌కులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈడీ కేసు ఉన్న ప‌వ‌న్ ఖేరా విమాన ప్ర‌యాణం చేయ‌డానికి లేదంటూ పోలీసులు అడ్డుకోవ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు నిర‌సించారు. అక్క‌డే ధ‌ర్నాకు దిగారు. బోర్డింగ్ పాస్ తీసుకుని విమానంలోకి వెళ్లిన ప‌వ‌న్ ఖేరాను పోలీసులు దించేయ‌డం రాజ‌కీయ వివాదస్ప‌దంగా మారింది.

ఢిల్లీ విమానాశ్ర‌యంలో ప‌న‌న్ ఖేరాకు ఘోర అవ‌మానం (Delhi Airport)  

చ‌త్తీస్ గ‌డ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ కేంద్రంగా ఏఐసీపీ ప్లీన‌రీకి దేశంలోని కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు బ‌య‌లు దేరారు. సీనియ‌ర్ నాయ‌కునిగా ఉన్న ప‌వ‌న్ ఖేరా కూడా గురువారం ఉద‌యం ఢిల్లీ నుంచి రాయ్ పూర్ వెళ్ల‌డానికి ఇండిగో విమానం(Delhi Airport) ఎక్కారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు ఆయ‌న్ను దించేయాల‌ని ఎయిర్ లైన్స్ అధికారుల‌ను ఆదేశించారు. అప్ప‌టికే బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కిన ప‌వ‌న్ ఖేరాను దిగాల‌ని ఇండిగో నిర్వాహ‌కులు కోర‌డం కాంగ్రెస్ లీడ‌ర్ల‌కు ఆగ్ర‌హం క‌లిగించింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌ర్కార్ జులుంను(Police) ప్ర‌శ్నిస్తూ ర‌న్ వే మీద కొద్దిసేపు ధ‌ర్నాకు దిగారు. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.

కాంగ్రెస్ స‌హ‌చ‌రులు నిరసన వ్యక్తం చూస్తూ మోడీ వ్య‌తిరేక నినాదాలు

డిసిపి (డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్) మిమ్మల్ని కలుస్తారని ఇండిగో నిర్వాహ‌కులు విమానంలోకి ఎక్కిన ప‌వ‌న్ ఖేరాకు తెలిపారు. కానీ, ల‌గేజి వ‌దులుకుని ఎలా వెళ్లాలంటూ అడ్డం తిరిగారు. అయిన‌ప్ప‌టికీ బ‌ల‌వంతంగా ఆయ‌న్ను విమానం నుంచి దింపేశారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయం టెర్మిన‌ల్ పై(Delhi Airport) కాంగ్రెస్ స‌హ‌చ‌రులు నిరసన వ్యక్తం చూస్తూ మోడీ వ్య‌తిరేక నినాదాలు చేస్తూ విమానం పక్కనే బైఠాయించారు. అరెస్ట్ వారెంట్ లేకుండానే పవన్ ఖేరాను ఆపారని ఆ పార్టీ ఆరోపించింది. ప‌వ‌న్ ఖేరాను అరెస్టు చేసేందుకు అస్సాం పోలీసు బృందం విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. అక్క‌డ పవన్ ఖేరాపై కేసు ఉన్నందునవిమానంలోకి అనుమతించకూడదని ఆదేశాలు ఉన్నాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేయ‌డం సిగ్గుచేటని కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌

ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారనే ఆరోపణలపై ఖేరాను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నేత ఒకరు పోలీసులకు(Police) ఫిర్యాదు చేశారు. ఆ నేప‌థ్యంలో జ‌రిగిన ప‌రిణామంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఢిల్లీ-రాయ్‌పూర్ విమానం నుంచి ఖేరాను దింపేయ‌డం ద్వారా మోడీ ప్రభుత్వం గూండా రాజ్యాన్ని తెలియ‌చేస్తోంద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయ‌న‌పై అభాండాలు మోపుతూ ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేయ‌డం సిగ్గుచేటని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు.

Also Read : Congress: నేడు 85వ ప్లీనరీ అజెండాను ప్రకటించనున్న కాంగ్రెస్

ఇటీవ‌ల అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ విచారణను డిమాండ్ చేస్తూ ప‌వ‌న్ ఖేరా డిమాండ్ చేశారు. ఆ సంద‌ర్భంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. స్వ‌ర్గీయ పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి జెపిసిని ఏర్పాటు చేయగలిగితే జేపీసీ ఏర్పాటుకు న‌రేంద్ర మోడీకి ఎందుకు అభ్యంత‌ర‌మంటూ నిల‌దీశారు. ఆ కార‌ణంగా ఢిల్లీ నుంచి రాయ్ పూర్ వెళుతోన్న విమానం నుంచి ప‌వ‌న్ ఖేరాను దింపేశార‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తొలుత కాంగ్రెస్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని(Delhi Airport) సీఆర్పీఎఫ్ అధికారి ఆపారు. కాంగ్రెస్ అధినేత పవన్ ఖేడాకు నోటీసులివ్వాల్సి ఉందన్నారు. ఆయ‌న‌కు నోటీసు ఇవ్వడానికి సీఆర్పీఎఫ్‌ అధికారులు విమానం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆ విమానంలో కెసి వేణుగోపాల్ , ఇతర కాంగ్రెస్ సీనియ‌ర్ జాతీయ నాయకులు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ సభలకు సిద్ధమైనప్పుడల్లా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈడి నోటీసును ఇవ్వ‌డం, ప‌వ‌న్ ఖేరా వ్య‌వ‌హారాల‌పై దాడులు చేయడం దురుద్దేశపూరిత చ‌ర్య‌లుగా వాళ్లు విమ‌ర్శించారు.

Also Read : AICC Task Force : సోనియా టాస్క్ ఫోర్స్-2024

ఆగ్రహించిన నేతలు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. జాతీయ కాంగ్రెస్ నేతలంతా అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయితే ఈ చర్య రాజకీయంగా దుమారం రేపింది. దీనికి నిరసనగా ఇక్కడ కాంగ్రెస్ పెద్ద ఉద్యమానికి సిద్ధమైంది. 85వ కాంగ్రెస్‌ సమావేశంకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 15 వేల మంది ఆఫీస్ బేరర్లు రాయ్ పూర్ స‌భ‌కు హాజ‌రు కానున్నారు. ఆ సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప‌వ‌న్ ఖేరా(Police) ఎపిసోడ్ రాజ‌కీయంగా చ‌ర్చినీయాంశం అయింది.