Delhi Air Pollution: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం (Delhi Air Pollution) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు కాలుష్యం విపరీతమైన స్థాయిలో పెరుగుతుంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్‌ల తయారైంది. కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం నేటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకురానుంది. ఇప్పుడు అమలవుతున్న గ్రాప్-1. గ్రాప్ -2కి తోడు గ్రాప్ -3 ఆంక్షలు కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే BS-3 పెట్రోల్, BS-4 డిజిల్ వాహనాలపై నిషేధం విధంచింది.
కన్‌స్ట్రక్షన్ పనులను తాత్కాలికంగా ఆపేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)పై ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత పడిపోతుంది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సైతం ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఐదో తరగతి విద్యార్థుల వరకు భౌతిక క్లాసులు నిలిపివేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని పాఠశాలలను ఆదేశించారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆన్లైన్ తరగతులను నిర్వహించాలన్న ప్రభుత్వం కోరింది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న దృష్ట్య GRAP – 3 ప్లాన్ ఢిల్లీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. గాలిలో కాలుష్యం ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువగా చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇకపోతే ప్రభుత్వం తీసుకున్న కొత్త ఆంక్షలు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి అమల్లోకి రానున్నాయి.
శ్వాస తీసుకోవడంలో సమస్యలు
ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి తీవ్రంగా ఉంది. దీని కారణంగా ఇక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాజధాని సగటు వాయు నాణ్యత సూచిక (AQI) శుక్రవారం 409 వద్ద ఉంది. ఇది మునుపటి కంటే తగ్గినప్పటికీ ఇది కూడా ప్రమాదకర పరిస్థితే. ఈ పరిస్థితిలో పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి మరింత సవాలుగా మారనుంది.
ప్రతి ప్రాంతంలో AQI 400 దాటింది
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో AQI తీవ్రమైన కేటగిరీలో ఉంది. చాలా ప్రాంతాల్లో AQI 400 కంటే ఎక్కువగా నమోదైంది. ఆనంద్ విహార్‌లో 441, అశోక్ విహార్‌లో 440, బవానాలో 455, ద్వారకలో 444, ఐజిఐ ఎయిర్‌పోర్ట్‌లో 446 ఎక్యూఐ స్థాయి నమోదైంది. అదే సమయంలో ముండ్కాలో 449, నజఫ్‌గఢ్‌లో 404, నరేలాలో 428, నెహ్రూ నగర్‌లో 438, రోహిణిలో 452 ఏక్యూఐ స్థాయి నమోదైంది.