Deepfake Video : యూపీ సీఎం యోగి ..డీప్ ఫేక్ వీడియో సంచలనం

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 12:12 PM IST

గత కొద్దీ రోజులుగా డీప్‌ఫేక్ వీడియోలు (Deepfake Video), ఫోటోలు (Deepfake Photos) వైరల్ గా మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటి క‌ట్ట‌డికి ప్ర‌య‌త్నించిన వీడీ బెడ‌ద మాత్రం త‌ప్ప‌ట్లేదు. మొన్నటి వరకు సినీ తారలను టార్గెట్ చేస్తూ హల్చల్ చేసిన డీప్ ఫేక్ వీడియోస్..ఇప్పుడు రాజకీయ నేతలను కూడా టచ్ చేసాయి. అదికూడా రాష్ట్ర సీఎం ను. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరప్రదేశ్ సీఎం (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) కు సంబదించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ న్యూస్ ఛానల్ క్లిప్ లో యూపీ సీఎం యోగి మాట్లాడుతున్నట్లు, మధుమేహ బాధితుల కోసం తయారుచేసిన మందును కొనుగోలు చేయాలని సూచిస్తున్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఈ వీడియోను రూపొందించారు. హజ్రత్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో వీడియోను పోస్ట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఐపీసీ, ఐటీ యాక్ట్స్ కింద బాధ్యులపై కేసు నమోదు చేశారు. 41 సెకన్ల నిడివి గల ఆ వీడియో ఫిబ్రవరి 26వ తేదీన ఫేస్ బుక్ ప్రొఫైల్ గ్రేస్ గర్షియా పేరుతో అప్ లోడ్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ కనిపించడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటికే దానిని 2.25 లక్షల చాలా సార్లు చేశారు. 120 సార్లు షఏర్ చేశారు. ఇటీవల రష్మిక , టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ నకిలీ వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Read Also : BRS vs Congress : హద్దులు దాటుతున్న ట్రోల్స్‌..!