ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మహిళల సంఖ్య (Number of women) తగ్గింది. గత ఎన్నికల కంటే ఈసారి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే విజయం సాధించడం గమనార్హం. 2015, 2020 ఎన్నికల్లో మహిళా నేతల ప్రాతినిధ్యం కాస్త మెరుగ్గా ఉండగా, 2024 ఎన్నికల్లో ఈ సంఖ్య తగ్గడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Mango-Papaya: మామిడి, బొప్పాయి కలిపి తినవచ్చా.. వీటితో కండరాలు పెరుగుతాయా?
ఈసారి గెలిచిన ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలలో నలుగురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందినవారు కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి కేవలం ఆతిశీ మాత్రమే గెలుపొందారు. గత ఎన్నికల్లో మొత్తం 8 మంది మహిళలు విజయం సాధించగా, ఈసారి ఈ సంఖ్య తగ్గడం మహిళల రాజకీయ ప్రాతినిధ్యంపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బీజేపీ నేత కర్నాలీ సింగ్ నిలిచారు. ఆయనకు రూ. 259 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. రాజకీయ నేతల ఆర్థిక స్థితి పై చర్చ సాగుతున్న నేపథ్యంలో, కర్నాలీ సింగ్ అత్యధిక ఆస్తులు కలిగి ఉండటం గమనార్హం.
అంతేకాదు అత్యధిక నేర కేసులు ఉన్న ఎమ్మెల్యేగా ఆప్ నాయకుడు అమానుతుల్లా ఖాన్ నిలిచారు. ఆయనపై ఏకంగా 19 కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడైంది. రాజకీయాల్లో నేరప్రవృత్తి గల అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండడం ప్రజాస్వామ్యానికి హానికరమని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా నేతల ప్రాతినిధ్యం తగ్గడం, ధనికులు, నేరప్రవృత్తి గల నేతల గెలుపు వంటి అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు అవసరాన్ని సూచిస్తున్నాయి.